Team India : టీమిండియా పాలిటిక్స్ తట్టుకోలేరు.. లాంగర్ కు కే ఎల్ రాహుల్ సలహా
ప్రపంచంలో అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు బీసీసీఐకి ఐసీసీని శాసించే శక్తి ఉంది. ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందికి భారీ జీతభత్యాలు అందిస్తుంటుంది.
ప్రపంచంలో అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు బీసీసీఐకి ఐసీసీని శాసించే శక్తి ఉంది. ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందికి భారీ జీతభత్యాలు అందిస్తుంటుంది. అందుకే చాలా మంది మాజీ విదేశీ ప్లేయర్స్ సైతం బీసీసీఐతో పని చేసేందుకు ఎదురు చూస్తుంటారు. అయితే ఈ సారి టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ విడుదల చేసిన ప్రకటనపై విదేశీ మాజీ క్రికెటర్లు ఆసక్తి చూపించట్లేదు. ఆస్ట్రేలియా మాజీ కోచ్, ప్రస్తుత లక్నో సూపర్ జెయింట్స్ కోచ్ జస్టిన్ లాంగర్ చెప్పిన కారణం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అంతేగాక లాంగర్ వివరణ టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌ను చిక్కుల్లో పడేసింది. కేఎల్ రాహుల్ ఇచ్చిన సలహా కూడా తనపై ప్రభావం చూపించిందని అన్నాడు. టీమిండియా కోచ్ పదవి అంటే ఒత్తిడితో పాటు రాజకీయాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాహుల్ సలహా ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌తో పోలిస్తే ఒత్తిడి, పాలిటిక్స్ వెయ్యి రెట్లు అధికంగా ఉంటాయని రాహుల్ చెప్పినట్టు లాంగర్ వెల్లడించాడు. భారత జట్టు కోచ్ మంచి జాబేననీ, కానీ ఇప్పుడు తనకు అది సరైన సమయం కాదని తేల్చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ పాలిటిక్స్ తాను తట్టుకోలేనంటూ పరోక్షంగా చెప్పేశాడు.