రాహుల్ కంటే ముందు అక్షర్ ఏం చేస్తున్నావ్ గంభీర్ ?
ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్ లోనూ దుమ్మురేపిన భారత్ 4 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది.

ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్ లోనూ దుమ్మురేపిన భారత్ 4 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో దుమ్మురేపగా… గిల్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ కూడా రాణించారు. ఫలితంగా 305 పరుగులు టార్గెట్ ను భారత్ 44.3 ఓవర్లలోనే ఈజీగా ఛేదించేసింది. కానీ ఈ మ్యాచ్ లో చేసిన ప్రయోగం విమర్శలకు తావిస్తోంది. బ్యాటింగ్ ఆర్డర్ లో కెెఎల్ రాహుల్ ను ఆరోస్థానానికి పరిమితం చేయడం ఆశ్చర్యపరుస్తోంది. అది కూడా మరొక స్టార్ బ్యాటర్ కోసం ఇలాంటి మార్పు చేసారంటే పర్లేదు.. కానీ బౌలింగ్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కోసం రాహుల్ లాంటి కీలక ఆటగాడిని బ్యాటింగ్ ఆర్డర్ లో కిందకి పంపించడం ఎంతవరకూ కరెక్టో అనేది కోచ్ గంభీరే చెప్పాలని పలువురు మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
మాజీ క్రికెటర్ దొడ్డ గణేశ్ గంభీర్ స్ట్రాటజీపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు … ఈస్థానంలో అక్షర్ పటేల్ సక్సెస్ కావొచ్చని కానీ ఒక కీలక బ్యాటర్ ను ఆరోస్థానంలో ఆడించడం సరికాదన్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన రెండు వన్డేల్లో అక్షర్ పటేల్ రాహుల్ కంటే ముందు బ్యాటింగ్ కు వచ్చాడు. తొలి వన్డేలో హాఫ్ సెంచరీ చేయగా.. రెండో వన్డేలో 41 రన్స్ చేశాడు. శ్రేయాస్ తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అదే సమయంలో రాహుల్ మాత్రం తన ఫ్లాప్ షో కంటిన్యూ చేస్తున్నాడు. రెండు మ్యాచ్ లలోనూ తక్కువ స్కోర్లకే ఔటయ్యాడు. ఒకవిధంగా రాహుల్ పేలవ ఫామ్ కంటిన్యూ చేయడానికి కోచ్ గంభీరే కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. రాహుల్ కంటే ముందు అక్షర్ ను పంపించడం చెత్త వ్యూహం అంటూ మాజీ క్రికెటర్ దొడ్డ గణేశ్ ఫైర్ అయ్యాడు.
గంభీర్ కు అసలు సెన్స్ ఉండే ఇలా మార్పులు చేస్తున్నాడా అంటూ ప్రశ్నించాడు. టాపార్డర్ లో కీలక బ్యాటర్ ను ఆరోస్థానంలో ఎవరైనా పంపిస్తారా అంటూ విమర్శలు గుప్పించాడు. పైగా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు బ్యాటింగ్ ఆర్డర్ లో ఇలాంటి చెత్త ప్రయోగాలు చేయడమేంటని ఫైర్ అయ్యాడు. బౌలింగ్ ఆల్ రౌండర్ అన్నిసార్లు బ్యాటింగ్ లో సక్సెస్ కాలేడని గుర్తు చేశాడు. అదే సమయంలో కీలక బ్యాటర్ కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తుందని చెప్పాడు. ప్రస్తుతం రాహుల్ విషయంలో ఇదే జరుగుతుందని చెప్పుకొచ్చాడు.