Zimbabwe, Team India : యంగ్ ఇండియాకు ఎదురుందా ?
జింబాబ్వే పర్యటనలో టీమిండియా మరో పోరుకు సిద్దమైంది. ఇవాళ జరిగే నాలుగో టీ20లో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటోంది.

Team India is ready for another battle in the tour of Zimbabwe.
జింబాబ్వే పర్యటనలో టీమిండియా మరో పోరుకు సిద్దమైంది. ఇవాళ జరిగే నాలుగో టీ20లో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటోంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టులో ఒకే ఒక్క మార్పు జరిగే అవకాశం ఉంది. గత మూడు మ్యాచ్‌లు ఆడిన ఆవేశ్ ఖాన్‌కు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పించే అవకాశం ఉంది. అతని స్థానంలో తుషార్ దేశ్ పాండే అరంగేట్రం చేసే అవకాశం ఉంది. మిగతా కాంబినేషన్‌లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. ఇదిలా ఉంటే ఓపెనర్లుగా గిల్ , జైస్వాల్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నారు. అభిషేక్ శర్మను ఓపెనర్ గా పంపాలని పలువురు సూచిస్తున్నా లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కోసమే గిల్ జైస్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. కాగా సంజూ శాంసన్, శివమ్ దూబే ఈ మ్యాచ్ లో సత్తా చాటాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.