Virat Kohili: ఢిల్లీ మొత్తం గాలిపటాలే మా సెలెబ్రేషన్స్ కెవ్వు కేక
దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా క్రికెటర్లు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Team India player Virat Kohli celebrated Independence Day celebrations with joy
దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా క్రికెటర్లు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రాముఖ్యతను మరోసారి గుర్తు చేశారు. ఈ రోజు తనకు చాలా ప్రత్యేకమైనదంటూ పేర్కొన్నారు. ‘ఇండిపెండెన్స్ డే దేశ ప్రజలందరికీ చాలా ముఖ్యమైన రోజు. మనం గర్వించాల్సిన రోజు. అయితే ఈ రోజు నాకు మరింత ప్రత్యేకం. ఎందుకంటే ఈ రోజే మా నాన్నగారి జన్మదినం. ఈ రెండు ప్రత్యేకతలను ఒకే రోజు నిర్వహించుకోవడం నాకు మరింత సంతోషంగా ఉంటుంది.
స్వాతంత్య్ర దినోత్సవం రోజు నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గాలిపటాలు ఎగురవేయటం దిల్లీలో ఆనవాయితీ. దాని కోసం కావాల్సిన వస్తువులను ముందుగానే సిద్ధం చేసుకొనే వాళ్లం. ఇది నాకు ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకం’ అంటూ విరాట్ కోహ్లీ తన ప్రత్యేకమైన రోజు గురించి ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. పలువురు మాజీ క్రికెటర్లతో పాటు, భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు. ‘స్వాతంత్య్రం కోసం తమ జీవితాలు అర్పించిన వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు’’ అని లక్ష్మణ్ ట్వీట్ చేశాడు.