టాప్ ప్లేస్ లోనే భారత్ 8వ ప్లేస్ కు దిగజారిన పాక్

పాకిస్తాన్ పై టెస్ట్ సిరీస్ ను వైట్ వాష్ చేసిన బంగ్లాదేశ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో అనూహ్యంగా ఎగబాకింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 3, 2024 | 07:16 PMLast Updated on: Sep 03, 2024 | 7:16 PM

Team India Secure Top Place In World Test Championship

పాకిస్తాన్ పై టెస్ట్ సిరీస్ ను వైట్ వాష్ చేసిన బంగ్లాదేశ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో అనూహ్యంగా ఎగబాకింది. పాయింట్లను గణనీయంగా మెరుగుపరుచుకుని ఏకంగా నాలుగో స్థానానికి చేరుకుంది. తాజాగా విడుదలైన డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ టాప్ ప్లేస్ లో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా , న్యూజిలాండ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక బంగ్లా చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్ ఏకంగా 8వ స్థానానికి పడిపోయింది. ఇటీవలే శ్రీలంకపై రెండో టెస్ట్‌లో విజయం సాధించిన ఇంగ్లండ్‌ ఐదో స్థానానికి ఎగబాకగా.. సౌతాఫ్రికా ఆరు, శ్రీలంక ఏడో స్థానంలో నిలిచాయి. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో కేవలం ఒకే ఒక విజయం సాధించిన వెస్టిండీస్‌ చిట్టచివరి స్థానంలో నిలిచింది. వచ్చే ఏడాది మే నెలాఖరున మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు డబ్ల్యూటీసీ ఫైనల్ లో తలపడతాయి.