ఫుడ్ కోసం కోహ్లీ తిప్పలు బీసీసీఐ కొత్త రూల్స్ తో కష్టాలు
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫుడ్ కోసం తంటాలు పడుతున్నాడు. అదేంటి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న విరాట్ భోజనం కోసం తిప్పలు పడడం ఏంటని అనుకుంటున్నారా...

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫుడ్ కోసం తంటాలు పడుతున్నాడు. అదేంటి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న విరాట్ భోజనం కోసం తిప్పలు పడడం ఏంటని అనుకుంటున్నారా… మరేం లేదు బీసీసీఐ తీసుకొచ్చిన కొత్త రూల్స్ తోనే కోహ్లీకి ఫుడ్డు కష్టాలు మొదలయ్యాయి. డైట్ విషయంలో విరాట్ కోహ్లీ చాలా కఠినంగా ఉంటాడు. ఖచ్చితంగా ప్రోటీన్ డైట్ ఫాలో అవుతూ ఫిట్ నెస్ టిప్స్ ఫాలో అవుతాడు. చాలా కాలంగా డైట్, జిమ్ బ్యాలెన్స్ చేసుకుంటూ పర్ఫెక్ట్ బాడీని మెయింటేన్ చేస్తూ వస్తున్నాడు. విరాట్ కోహ్లి ఎక్కడపడితే అక్కడ, ఏది పడితే అది తినడు. కోహ్లికి సపరేట్ చెఫ్ ఉంటాడు. తనకు కావాల్సినవి చెప్పినట్టు చేస్తూ వండిపెడుతుంటాడు.
అయితే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్ వెళ్ళిన కోహ్లీకి అతని ఫేవరెట్ ప్రొటీస్ ఫుడ్ దొరకడం లేదు. నిజానికి మొన్నటి వరకూ కూడా చెఫ్ ను తీసుకెళ్ళిన కోహ్లీ తనకు కావాల్సిన ఫుడ్ ను ప్రిపేర్ చేయించుకునే వాడు. కానీ బీసీసీఐ ఇటీవలే కొత్త ఆంక్షలు పెట్టింది.
ఈ పది రూల్స్ లో ఆటగాడు ఏదైనా టూర్, సిరీస్ లకు వెళ్లేటప్పుడు తమ వ్యక్తిగత సిబ్బంది.. అంటే వ్యక్తిగత మేనేజర్లు, చెఫ్స్, అసిస్టెంట్స్, సెక్యూరిటీని తీసుకు వెళ్లడంపై నిషేధం విధించింది. అయితే బీసీసీఐ పెట్టిన ఈ షరతు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి ఇబ్బందికరంగా మారింది. దీంతో విరాట్ కోహ్లీ తన వ్యక్తిగత చెఫ్ ను తీసుకెళ్లలేని పరిస్థితి. డైట్ విషయంలో కఠినంగా ఉండే కోహ్లీకి ఇది పెద్ద సమస్యగా మారింది. దీంతో అతను తన డైట్ ఫుడ్‌ను బయట నుంచి ఆర్డర్ పెట్టుకున్నాడు. ప్రత్యేకంగా చెఫ్ లేకపోవడంతో లోకల్ టీమ్ మేనేజర్‌కు చెప్పి తనకు కావాల్సిన వాటిని తెప్పించుకున్నాడు.
కోహ్లీ అభ్యర్థన మేరకు ఫేమస్ ఫుడ్ పాయింట్ నుంచి ఫుడ్ ప్యాకెట్లను తెప్పించి కోహ్లీకి అందించినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. ప్రాక్టీస్ పూర్తయిన వెంటనే కోహ్లీకి ఆ స్పెషల్ ఫుడ్ ప్యాకెట్లు డెలివరీ అయ్యాయి. దీంతో గ్రౌండ్ లోనే కోహ్లీ తన లంచ్ ని పూర్తి చేశాడు. ఇక జర్నీలో తినేందుకు మరికొన్ని ప్యాకెట్స్ ని దాచుకున్నాడు. ఆ ఫుడ్ తిని విరాట్ కోహ్లీ వాంతులు చేసుకున్నట్లు క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఈ ఛాంపియర్స్ ట్రోఫీ పూర్తయ్యే వరకు విరాట్ కోహ్లీకి ఫుడ్ తిప్పలు తప్పేలా లేవని తెలుస్తోంది. బీసీసీఐ తీసుకువచ్చిన ఈ కొత్త రూల్.. మొత్తానికి విరాట్ కోహ్లీ పొట్ట కొడుతుందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.