Team India stars : కత్తి లాంటి ఫిట్నెస్..
టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి గురించి స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ అంకిత్ కలియార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ చూడటానికి బొద్దుగా కనిపించినా.. కోహ్లి మాదిరిగానే అతడూ పూర్తి ఫిట్‌గా ఉంటాడని పేర్కొన్నాడు. మైదానంలో హిట్ మ్యాన్ కదలికలు చూస్తే ఎవరికైనా ఈ విషయం ఇట్టే అర్థమైపోతుందని అంకిత్ కలియార్ రోహిత్‌పై ప్రశంసలు కురిపించాడు.

Strength and conditioning coach Ankit Kaliar made interesting comments about Team India stars Rohit Sharma and Virat Kohli.
టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి గురించి స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ అంకిత్ కలియార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ చూడటానికి బొద్దుగా కనిపించినా.. కోహ్లి మాదిరిగానే అతడూ పూర్తి ఫిట్‌గా ఉంటాడని పేర్కొన్నాడు. మైదానంలో హిట్ మ్యాన్ కదలికలు చూస్తే ఎవరికైనా ఈ విషయం ఇట్టే అర్థమైపోతుందని అంకిత్ కలియార్ రోహిత్‌పై ప్రశంసలు కురిపించాడు. అదే విధంగా.. ఫిట్‌నెస్ విషయంలో కోహ్లి అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటాడన్న అంకిత్.. భారత క్రికెటర్లు ఫిట్‌నెస్‌పై ఇంతగా అవగాహన పెంచుకోవడానికి అతడే ప్రధాన కారణమని కొనియాడాడు. యువ ఆటగాళ్లలో శుభ్‌మన్ గిల్ కోహ్లి మాదిరే సూపర్ ఫిట్‌గా ఉంటాడని.. విరాట్ భాయ్ తన రోల్ మోడల్‌గా భావిస్తాడని చెప్పుకొచ్చాడు. కోహ్లి ఎంత ఫిట్‌గా ఉంటాడో రోహిత్ కూడా అంతే ఫిట్‌గా ఉంటాడు. అయితే, ఫిట్‌నెస్ విషయంలో కొలమానం అంటే విరాట్ కోహ్లి పేరునే చెప్పాల్సి ఉంటుంది. టీమిండియాలో దీనిని ఒక సంస్కృతిగా మార్చిన ఘనత కోహ్లికే దక్కుతుంది. అగ్రశ్రేణి ఆటగాడిని మిగతా ప్లేయర్లూ అనుసరించే అవకాశం ఉంటుంది. కెప్టెన్‌గా ఉన్న సమయంలో కోహ్లి ప్రతి ఒక్కరిని ఫిట్‌నెస్ విషయంలో మోటివేట్ చేశాడు. అని అంకిత్ కలియార్ పేర్కొన్నాడు.