India 2023 World Cup Champion : సరిపోదా ఆదివారం..
సుమారు పదేళ్లుగా ఐసీసీ ట్రోఫీ నెగ్గలేకపోతోన్న టీమ్ ఇండియా.. ఈ ప్రపంచకప్‌తో నైనా ఆ కరువుకు స్వస్తి పలకాలని పట్టుదలగా ఉంది. ఆతిథ్య దేశంగా ప్రపంచకప్ ఆడుతున్న టీమిండియా. మొత్తం టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్లోకి ప్రవేశించింది.

Team India, which has not been able to win the ICC trophy for about ten years, is determined to end that drought with this World Cup.
సుమారు పదేళ్లుగా ఐసీసీ ట్రోఫీ నెగ్గలేకపోతోన్న టీమ్ ఇండియా.. ఈ ప్రపంచకప్‌తో నైనా ఆ కరువుకు స్వస్తి పలకాలని పట్టుదలగా ఉంది. ఆతిథ్య దేశంగా ప్రపంచకప్ ఆడుతున్న టీమిండియా. మొత్తం టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్లోకి ప్రవేశించింది. అలాగే టోర్నీలోని అన్ని బలమైన జట్లను ఏకపక్షంగా ఓడించింది. అందుకే ఈసారి భారత్ ప్రపంచ ఛాంపియన్ అని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇక బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ భారత్ గెలుస్తుందని ప్రముఖ జ్యోతిష్యులు అంచనా వేశారు.
Australia VS South Africa : ఓటమికి కారణం అదే..
ఇది కూడా నిజమైంది. ముంబైలో కివీస్‌ను చిత్తు చేసి ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది రోహిత్ సేన. కాగా వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకోవడం ఇది నాలుగోసారి. అయితే ఇప్పటివరకు భారత జట్టు రెండుసార్లు మాత్రమే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. వరల్డ్ కప్ గెల్చిన రెండు సందర్భాల్లోనూ భారత్ తన సెమీఫైనల్ మ్యాచ్‌ను బుధవారమే ఆడింది. ఈసారి కూడా బుధవారమే జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యాదృచ్ఛికం నిజమైతే టీమ్ ఇండియా 2023 ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలవడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్.