ahul Dravid : ఈసారీ స్వదేశీ కోచ్ ఖాయం
టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం టీ20 ప్రపంచకప్-2024తో ముగియనుంది. దీంతో కొత్త కోచ్‌ను భర్తీ చేసే పనిలో బీసీసీఐ పడింది.
టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం టీ20 ప్రపంచకప్-2024తో ముగియనుంది. దీంతో కొత్త కోచ్‌ను భర్తీ చేసే పనిలో బీసీసీఐ పడింది. అయితే భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి ధరఖాస్తు చేసుకునేందుకు గడువు సోమవారం సాయంత్రం ఆరు గంటలతో ముగిసింది. కొత్త హెడ్ కోచ్‌ను ఎంపిక చేసేందుకు మరింత సమయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే టీమిండియా హెడ్‌కోచ్ పదవికి విదేశీయులెవరూ దరఖాస్తు చేసుకోలేదని తెలుస్తోంది. ఆస్ట్రేలియా దిగ్గజాలు జస్టిన్ లాంగర్, రికీ పాంటింగ్ పేర్లు వినిపించినప్పటికి.. వారవ్వరూ ఆసక్తి చూపలేదు ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న లక్ష్మణ్ కూడా నో చెప్పినట్టు సమాచారం. ఇక ద్రవిడ్ వారుసుడుగా టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ను ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది.