Venkatesh Iyer Marriage : ఇంటివాడైన కోల్ కత్తా క్రికెటర్…
టీమిండియా యువ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ ఓ ఇంటివాడయ్యాడు. తన స్నేహితురాలు శృతి రఘునాథన్‌ను పెళ్లి చేసుకున్నాడు.

Team India's young cricketer Venkatesh Iyer has become a householder.
టీమిండియా యువ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ ఓ ఇంటివాడయ్యాడు. తన స్నేహితురాలు శృతి రఘునాథన్‌ను పెళ్లి చేసుకున్నాడు. అతికొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో వివాహమాడాడు. గతేడాది నవంబర్‌లో వెంకటేశ్-శృతి నిశ్చితార్థం జరిగింది.
తాజాగా అంగరంగ వైభవంగా వెంకటేశ్-శృతి (Venkatesh – Shruti) ఒక్కటయ్యారు. శృతి (Shruti) ఫ్యాషన్ డిజైనర్. బెంగళూరులోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీలో ఆమె పనిచేస్తున్నారు. ఇక వెంటకేశ్ అయ్యర్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2024 (IPL 2024) లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) ఛాంపియన్‌గా నిలవడంలో వెంకటేశ్ కీలక పాత్ర పోషించాడు. టీమిండియా తరఫున రెండు వన్డేలు, తొమ్మిది టీ20లు ఆడాడు. చివరగా 2022 ఫిబ్రవరిలో టీమిండియాకు వెంకటేశ్ ప్రాతినిథ్యం వహించాడు.