Nitish Kumar Reddy : తెలుగోడి దెబ్బ అదుర్స్ కదూ..
ఐపీఎల్ (IPL) లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఆటగాడు, ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) మరోసారి విధ్వంసం సృష్టించాడు.

Telugudi's blow sounds bad..
ఐపీఎల్ (IPL) లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఆటగాడు, ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) మరోసారి విధ్వంసం సృష్టించాడు. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో నితీష్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన నితీష్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. మొదటి ఆచితూచి ఆడిన నితీష్.. క్రీజులో సెటిల్ అయ్యాక బౌండరీల వర్షం కురిపించాడు. ఓపెనర్ ట్రావిస్ హెడ్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వరల్డ్‌క్లాస్ స్పిన్నర్లు అశ్విన్, చాహల్‌కు అయితే నితీష్ చుక్కలు చూపించాడు.
ఈ క్రమంలో కేవలం 30 బంతుల్లోనే నితీష్ కుమార్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 41 బంతులు ఎదుర్కొన్న నితీష్.. 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో 76 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. నితీష్ మెరుపు బ్యాటింగ్ తోనే హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది. కాగా అలవోకగా సిక్సర్లు బాదేసిన నితీష్ పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.