IPL Navjyoti Singh : అది ఖచ్చితంగా నాటౌట్.. అంపైర్ల నిర్ణయాన్ని తప్పు పట్టిన సిద్ధూ
ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తో మ్యాచ్ లో సంజూ శాంసన్ (Sanju Samson) వివాదాస్పద ఔట్ తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కొందరు ఔట్ అంటే మరికొందరు నాటౌట్ అంటున్నారు.

That is definitely not out.. Sidhu who got the umpires decision wrong
ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తో మ్యాచ్ లో సంజూ శాంసన్ (Sanju Samson) వివాదాస్పద ఔట్ తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కొందరు ఔట్ అంటే మరికొందరు నాటౌట్ అంటున్నారు. 46 బంతుల్లో 86 పరుగుల వద్ద ఉన్న సమయంలో అనూహ్య రీతిలో అవుటయ్యాడు. పదహారో ఓవర్లో ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో షాయీ హోప్‌నకు క్యాచ్ ఇచ్చాడు. అయితే, క్యాచ్ అందుకునే సమయంలో షాయీ హోప్ బౌండరీ లైన్‌ను తాకినట్లుగా అనిపించినా ఫీల్డ్ అంపైర్, థర్డ్ అంపైర్ అవుటివ్వడంతో సంజూ కెప్టెన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. సంజూ శాంసన్ విషయంలో అంపైర్ల నిర్ణయాన్ని మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ (Navjyoti Singh) సిద్ధు తప్పుబట్టాడు. కంటికి స్పష్టంగా కనిపిస్తున్నా సాంకేతికత పేరిట సంజూకు అన్యాయం జరిగిందని పేర్కొన్నాడు.
అతడు క్రీజులో ఉండి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. అంపైర్లు తీసుకున్న ఆ నిర్ణయం మ్యాచ్ స్వరూపాన్నే మార్చి వేసిందన్నాడు. సంజూ శాంసన్ అవుట్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ సైడ్ యాంగిల్‌లో చూసినపుడు ఫీల్డర్ బౌండరీ లైన్‌ను రెండుసార్లు తాకినట్లు స్పష్టంగా కనిపించిందనీ సిద్ధూ చెప్పాడు.సంజూ నాటౌట్ అని కచ్చితంగా చెప్పగలనన్న సిద్ధూ అంపైర్లు ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారని తాను అనుకోవడం లేదన్నాడు. ఇక్కడ ఎవరి తప్పు లేకపోయినా సంజూ బలైపోయాడని వ్యాఖ్యానించాడు. కాగా ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ 20 పరుగుల తేడాతో ఓడిపోయింది.