ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి చెన్నై క్యాంపులో ధోనీ ఎంట్రీ ఆరోజే

ఐపీఎల్ 18వ సీజన్ మరో నెలరోజుల్లో మొదలుకానుంది. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు అందుబాటులో ఉన్న ప్లేయర్స్ తో ప్రాక్టీస్ క్యాంప్స్ కూడా నిర్వహిస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 19, 2025 | 07:10 PMLast Updated on: Feb 19, 2025 | 7:10 PM

The 18th Season Of Ipl Will Start In Another Few Months

ఐపీఎల్ 18వ సీజన్ మరో నెలరోజుల్లో మొదలుకానుంది. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు అందుబాటులో ఉన్న ప్లేయర్స్ తో ప్రాక్టీస్ క్యాంప్స్ కూడా నిర్వహిస్తున్నాయి. ఐపీఎల్ సీజన్ వస్తుందంటే కొందరు స్టార్ ప్లేయర్స్ పైనే అందరి ఫోకస్ ఉంటుంది. ఈ లీగ్ కే క్రేజ్ తెచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఆట కోసం అభిమానులు ప్రతీసారీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. గత రెండు సీజన్ల నుంచి ధోనీ రిటైర్మెంట్ వార్తలు వినిపిస్తుండడంతో ఫ్యాన్స్ డీలా పడుతున్నారు. కానీ అభిమానుల కోసం ధోనీ ఎప్పటికప్పుడు ఫిట్ నెస్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఐపీఎల్ లో ఆడుతున్నాడు. ఈ సారి కూడా ధోనీ ఐపీఎల్ ఆడడం ఖాయమైంది. మెగా వేలంలో ధోనీని చెన్నై అన్ క్యాప్డ్ కేటగిరీలో తిరిగి దక్కించుకుంది. అయితే గత సీజన్ ముగిసిన తర్వాత ధోనీ మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. దీంతో పూర్తి స్థాయి ఫిట్ నెస్ తో ఉన్నాడా అన్న అనుమానాలు నెలకొన్నాయి.

ఈ అనుమానాలకు తెరదించుతూ ధోనీ ఫిట్ గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సీజన్ కోసం ఫుల్ ఫిట్ గా తయారయ్యాడట. త్వరలోనే అతడు సీఎస్కే ప్రీ సీజన్ క్యాంప్ లో జాయిన్ అవ్వబోతున్నాడని సమాచారం అందింది. ఈ విషయాన్ని ధోనీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 25న ధోనీ చెన్నై ప్రాక్టీస్ క్యాంపులో చేరనున్నట్టు తెలుస్తోంది. అతడు కెప్టెన్ గా వ్యవహరించకపోయినప్పటికీ జట్టులో ధోనీ క్రేజే ఏ మాత్రం తగ్గలేదు. మహీ.. సీఎస్కే జట్టుకు ఓ ఆటగాడిగా కన్నా ఎక్కువన్నది చెన్నై ఫ్రాంచైజీ వర్గాల మాట. గతంతో పోలిస్తే మిస్టర్ కూల్ మరింత ఫిట్ గా తయారయ్యాడని చెన్నై ఫ్రాంచైజీ ప్రతినిధి ఒకరు చెప్పారు. అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో చారిత్రక విజయాలు అందించిన మహేంద్రసింగ్ ధోనీ ఐపీఎల్ లోనూ తనదైన ముద్ర వేశాడు. చెన్నై జట్టుకు తిరుగులేని క్రేజ్ రావడానికి ధోనీనే కారణం. ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా మహికి అద్భుతమైన రికార్డుంది.

ఇప్పటి వరకూ 264 మ్యాచ్ లలో 5 వేలకు పైగా పరుగులు చేసిన ధోనీ ఖాతాలో 24 హాఫ్ సెంచరీలున్నాయి. అయితే వచ్చే సీజన్ లో మహేంద్రుడు ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగుతాడన్న అంచనాలున్నాయి. మార్చి 22 నుంచి ఐపీఎల్ 2025 సీజన్ మొదలుకానుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ తన ఓపెనింగ్ మ్యాచ్ ను ముంబయి ఇండియన్స్ తో మార్చి 23న ఆడనుంది. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. రుతురాజ్ గైక్వాడ్ ఈ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఐపీఎల్ మెగావేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్, మతీష పతీరణ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీలను రిటైన్ చేసుకుంది. వేలంలో రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రవిచంద్రన్ అశ్విన్, ఖలీల్ అహ్మద్ , నూర్ అహ్మద్, సామ్ కరన్ వంటి ప్లేయర్స్ ను తీసుకుంది.