మీకు సిగ్గుందా… మొగుడు,పెళ్ళాలను విడదీస్తారా ?

బీసీసీఐ కొత్త తీసుకొచ్చిన ఆంక్షలు టీమిండియా సీనియర్ క్రికెటర్లకు ఏమాత్రం రుచించడం లేదు. ముఖ్యంగా విదేశీ టూర్లలో తమ కుటుంబసభ్యులను అనుమతించే విషయంలో బీసీసీఐ పెట్టిన కొత్త కండీషన్లను వారెవరూ ఒప్పుకోవడం లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 19, 2025 | 12:50 PMLast Updated on: Mar 19, 2025 | 12:50 PM

The Bcci However Is Not Backing Down On The New Rules

బీసీసీఐ కొత్త తీసుకొచ్చిన ఆంక్షలు టీమిండియా సీనియర్ క్రికెటర్లకు ఏమాత్రం రుచించడం లేదు. ముఖ్యంగా విదేశీ టూర్లలో తమ కుటుంబసభ్యులను అనుమతించే విషయంలో బీసీసీఐ పెట్టిన కొత్త కండీషన్లను వారెవరూ ఒప్పుకోవడం లేదు. దీనిపై ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమకు ఫ్యామిలీనే ముఖ్యమని తేల్చి చెప్పేశారు. అందరికీ కుటుంబ సభ్యులు ఉంటారు… అలాంటప్పుడు భార్యలను తీసుకువెళ్లకూడదని రూల్స్ పెట్టడం కరెక్ట్ కాదని వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా ఈ రూల్స్ పై పెదవి విరిచారు. అత్యంత దారుణంగా రూల్స్ పెడుతున్నారని మండిపడ్డారు. అయితే నేరుగా భారత క్రికెట్ నియంత్రణ మండలిపై నేరుగా విమర్శించకుండా పరోక్షంగా స్పందిస్తున్నారు. టీమ్​ఇండియా పర్యటనల్లో క్రికెటర్లతో పాటు వాళ్ల కుటుంబాలు ఉంటే మంచిదని కోహ్లీ అన్నాడు. గ్రౌండ్​ కష్టంగా గడిచిన రోజుల్లో ఒంటరిగా గదిలో ఇబ్బంది పడే బదులు కుటుంబ సభ్యులతో ఉండడానికే తాను ఇష్టపడతానని చెప్పాడు.

కానీ బీసీసీఐ మాత్రం కొత్త రూల్స్ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. దీంతో కోహ్లీ చేసిన వ్యాఖ్యలకు మద్ధతుగా అతని భార్య అనుష్కశర్మ కూడా బీసీసీఐని పరోక్షంగా టార్గెట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పరోక్షంగా బీసీసీఐని పెట్టిన రూల్స్ ను ఆమె వ్యతిరేకించింది. నువ్వు తెలిసిన ప్రతి ఒక్కరి మనసులో నీ గురించి వేరు వేరు అభిప్రాయాలు ఉంటాయి అంటూ ఆసక్తికరమైన పోస్టును అనుష్క శర్మ ఇన్ స్టాలో పెట్టింది. చివరకు రోడ్లపై నిన్ను చూసిన వారు కూడా.. నీ గురించి వారిలో సొంత అభిప్రాయాన్ని ఏర్పరుచుకుంటారు. చివరకు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా నువ్వు ఒకేలా కనిపించవు. నువ్వు మాత్రం ఎప్పటికీ ఇంకొకరివి కాలేవు అని అనుష్క శర్మ రాసుకొచ్చింది.

ఈ వ్యాఖ్యలను చూస్తే… భారత క్రికెట్ నియంత్రణ మండలి రూల్స్ పైన సెటైర్లు పేల్చుతూ… అనుష్క శర్మ స్పందించినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా టూర్ లో టీమిండియా వైఫల్యం తర్వాత బీసీసీఐ 10 కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. బీసీసీఐ రూపొందించిన రూల్స్ లో.. క్రికెటర్స్ కుటుంబ సభ్యుల గురించి కూడా ఉంది. విదేశీ పర్యటనలు చేసేటప్పుడు.. క్రికెటర్స్ వెంటపెట్టుకుని తీసుకెళ్లిన ఫ్యామిలీ మెంబర్ నిర్ణీత సమయం మాత్రమే ఉండాలని పరిమితులు విధించింది. లాంగ్ టూర్ సమయంలో భార్య, పిల్లలు కేవలం రెండు వారాలు మాత్రమే ఉండాలని, అదే తక్కువ వ్యవధి ఉన్న పర్యటనలో వారం రోజులు మాత్రమే ఉండాలని నిబంధనలను జారీ చేసింది. ప్రస్తుతం ఐపీఎల్ లోనూ దాదాపు ఇవే రూల్స్ ను ఫాలో అవుతోంది. కానీ భారత జట్టులోని సీనియర్ క్రికెటర్లెవరు అందరూ ఈ రూల్స్ ను వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు క్రికెటర్ల భార్యలు కూడా బీసీసీఐపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఐపీఎల్ ముగిసిన తర్వాత దీనిపై బోర్డు పెద్దలతో చర్చించే అవకాశాలున్నట్టు వార్తలు వస్తున్నాయి.