ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్ ఆఫ్ టోర్నమెంట్ అయిదుగురు మనోళ్లే

ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసింది..హోరాహోరీగా సాగిన ఈ మెగా టోర్నీలో అంచనాలకు తగ్గట్టే రాణించిన టీమిండియా టైటిల్ గెలుచుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 12, 2025 | 02:20 PMLast Updated on: Mar 12, 2025 | 2:20 PM

The Champions Trophy Team Of The Tournament Is Made Up Of Five Men

ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసింది..హోరాహోరీగా సాగిన ఈ మెగా టోర్నీలో అంచనాలకు తగ్గట్టే రాణించిన టీమిండియా టైటిల్ గెలుచుకుంది. భారత జట్టులో పలువురు ఆటగాళ్ళు నిలకడగా రాణించి టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇదిలా ఉంటే తాజాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ ను ప్రకటించింది. ఇందులో భారత క్రికెటర్ల హవా కనిపించింది.మొత్తంగా మూడు జట్ల ప్లేయర్స్ కే ఇందులో చోటు దక్కిగా…భారత్ నుంచి ఐదుగురు ఇండియన్ ప్లేయర్స్ కు 11 మందిలో ఎంపికయ్యారు. ఇండియా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ ప్లేయర్స్ మాత్రమే ఇందులో ఉన్నారు. ఇండియా నుంచి ఐదుగురు, న్యూజిలాండ్ నుంచి నలుగురు, ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఇద్దరు ప్లేయర్స్ కు చోటు దక్కింది.

టోర్నీ మొత్తం నిలకడగా రాణించిన బ్యాటర్లు విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తోపాటు పేస్ బౌలర్ మహ్మద్ షమి, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ జట్టులో ఉన్నారు. మరో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ 12వ ప్లేయర్ గా ఉన్నాడు. ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రం చోటు దక్కలేదు.ఇక ఈ జట్టులో నలుగురు న్యూజిలాండ్ ప్లేయర్స్ కు చోటు లభించింది. వీళ్లలో ఓపెనర్, టోర్నీలో రెండు సెంచరీలు చేసిన రచిన్ రవీంద్ర ఒకరు. అతనితోపాటు టోర్నీలో తన కళ్లు చెదిరే ఫీల్డింగ్ తో అదరగొట్టిన గ్లెన్ ఫిలిప్స్, స్పిన్నర్ మిచెల్ సాంట్నర్, పేస్ బౌలర్ మ్యాట్ హెన్రీ ఉన్నారు. కెప్టెన్ గా మిచెల్ సాంట్నర్ కు అవకాశం దక్కింది.

ఇక ఇండియా, న్యూజిలాండ్ కాకుండా ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన ఇద్దరు ప్లేయర్స్ టీమ్ లో ఉన్నారు. వీళ్లలో ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధికంగా 177 పరుగుల వ్యక్తిగత స్కోరు చేసిన ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్, మిడిలార్డర్ లో అజ్మతుల్లా ఒమర్జాయ్ లకు చోటు దక్కింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తంగా 8 జట్లు పాల్గొన్నా.. టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్లో కేవలం మూడు జట్లకే ప్రాతినిధ్యం దక్కింది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లకు నిరాశే ఎదురైంది. వీటిలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీఫైనల్లో ఓడిపోగా.. మిగిలిన మూడు టీమ్స్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టాయి. ఆఫ్ఘనిస్తాన్ కూడా లీగ్ స్టేజ్ లోనే వెళ్లిపోయినా.. ఆ జట్టు నుంచి ఇద్దరు ఇందులో చోటు దక్కించుకున్నారు. ఇక ఆతిథ్య పాకిస్థాన్ జట్టు నుంచి ఒక్కరు కూడా ఎంపిక కాలేదు.