ODI World Cup 2023 : కోహ్లీ షాట్ కి ఉలిక్కి పడ్డ అశ్విన్..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భారత్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే అభిమానులకు కావాల్సినంత మజా దొరికింది. ముగ్గురు టీమ్ ఇండియా బ్యాటర్లు డకౌట్‌గా పెవిలియన్‌కు చేరడంతో షాక్.. మేమున్నామంటూ ఛేజింగ్ కింగ్, విరాట్ కోహ్లీ - మిడిలార్డర్ బ్యాటర్, కేఎల్ రాహుల్ లు సొగసైన ఇన్నింగ్స్‌లతో చెలరేగారు. వరుసగా మూడు వికెట్లు పడినప్పుడు ఎలాంటి టెన్షన్ కలిగిందో..!

The fans got enough fun in the first match played by India in the ODI World Cup 2023 tournament
Ravichandran Ashwin వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భారత్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే అభిమానులకు కావాల్సినంత మజా దొరికింది. ముగ్గురు టీమ్ ఇండియా బ్యాటర్లు డకౌట్‌గా పెవిలియన్‌కు చేరడంతో షాక్.. మేమున్నామంటూ ఛేజింగ్ కింగ్, విరాట్ కోహ్లీ – మిడిలార్డర్ బ్యాటర్, కేఎల్ రాహుల్ లు సొగసైన ఇన్నింగ్స్‌లతో చెలరేగారు. వరుసగా మూడు వికెట్లు పడినప్పుడు ఎలాంటి టెన్షన్ కలిగిందో.. విరాట్ కోహ్లీ క్యాచ్ సమయంలోనూ అభిమానులతోపాటు టీమ్ ఇండియా ఆటగాళ్లలోనూ అంతకంటే పది రెట్లు ఆందోళన రేగింది. ఇదే విషయంపై ‘చెన్నై లోకల్ ప్లేయర్’ రవిచంద్రన్ అశ్విన్ కూడా టెన్షన్‌కు గురయ్యాడంట. ఆ సమయంలో నేను డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నా. ఒక్కో వికెట్ పడుతూ ఉంది. అయితే, అన్నింటి కంటే నన్ను కలవరానికి గురి చేసింది మాత్రం విరాట్ కోహ్లీ గాల్లోకి బంతిని పైకి లేపినప్పుడే. ఒక్కసారిగా డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు పరిగెత్తా. అభిమానులు కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. క్యాచ్ చేజారడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత నేను కూడా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిపోయా. ఆట పూర్తయ్యే వరకూ అక్కడ ఒకే స్థానంలో ఉండిపోయా. ఇప్పటికీ నా కాళ్ళు కాస్త నొప్పిగా ఉన్నాయి అంటూ, ఫన్నీగా అశ్విన్ బదులిచ్చాడు.