Kohli : పలు రికార్డుల ముంగిట కోహ్లీ..
భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ జనవరి 25 నుంచి హైదరాబాద్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ ముంగిట టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లిని అరుదైన రికార్డు ఊరిస్తోంది. టెస్ట్ క్రికెట్ లో 9 వేల పరుగుల మైలురాయి అందుకునేందుకు చేరువలో నిలిచాడు.
భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ జనవరి 25 నుంచి హైదరాబాద్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ ముంగిట టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లిని అరుదైన రికార్డు ఊరిస్తోంది. టెస్ట్ క్రికెట్ లో 9 వేల పరుగుల మైలురాయి అందుకునేందుకు చేరువలో నిలిచాడు. కోహ్లి మరో 152 పరుగులు చేస్తే, టెస్టు క్రికెట్‌లో 9 వేల రన్స్ పూర్తి చేసిన నాలుగో భారత బ్యాటర్ గా రికార్డులకెక్కుతాడు. ఇప్పటి వరకు భారత్ నుంచి కేవలం ముగ్గురు మాత్రమే ఈ రికార్డును అందుకున్నారు. గతంలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్ ఈ ఘనత సాధించారు. ప్రస్తుతం ఆడుతున్న వారిలో జో రూట్, స్టీవ్ స్మిత్ మాత్రమే 9,000 కంటే ఎక్కువ టెస్టు పరుగులు చేయగలిగారు. టెస్టు క్రికెట్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 8,848 పరుగులు చేశాడు.
ఇదిలా ఉంటే మరో అరుదైన రికార్డుపై కూడా కోహ్లీ కన్నేశాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసేందుకు చేరువలో ఉన్నాడు. కోహ్లీ మరో 545 రన్స్ చేస్తే.. భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. సచిన్ 53 ఇన్నింగ్సుల్లో 2535 పరుగులు చేయగా.. విరాట్ 50 ఇన్నింగ్సుల్లో 1991 పరుగులు చేశాడు.ప్రస్తుతం విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికా గడ్డపై ముగిసిన టెస్ట్ సిరీస్‌లో కోహ్లీ రాణించాడు. దీంతో తన సూపర్ ఫామ్ కొనసాగిస్తే ఈ రికార్డులు అందుకోవడం రన్ మెషీన్ కు ఏ మాత్రం కష్టం కాదు.