England Team : బోల్తా కొట్టిందిలే బజ్ బాల్ ఆట.. భారత్ లో వర్కౌట్ కాని ఇంగ్లాండ్ వ్యూహం
బజ్‌బాల్ అంటూ విర్రవీగిన ఇంగ్లండ్ జట్టు (England Team) కు టీమిండియా (Team India) భయాన్ని పరిచయం చేసింది. గత కొంతకాలంగా ప్రత్యర్ధి జట్టుతో సంబంధం లేకుండా సంప్రాదాయ క్రికెట్ రూపురేఖలను మార్చేసిన ఇంగ్లీష్ జట్టు.. భారత్ ముందు మాత్రం తలవంచింది. తొలి మ్యాచ్‌లో గెలుపొంది మాటలతో ఓవరాక్షన్ చేసిన ఇంగ్లాండ్ ప్రత్యర్ధి ఎవరన్నది ఇంగ్లండ్ మర్చిపోయింది.

The game of buzz ball that is overturned.. India's workout but England's strategy
బజ్‌బాల్ అంటూ విర్రవీగిన ఇంగ్లండ్ జట్టు (England Team) కు టీమిండియా (Team India) భయాన్ని పరిచయం చేసింది. గత కొంతకాలంగా ప్రత్యర్ధి జట్టుతో సంబంధం లేకుండా సంప్రాదాయ క్రికెట్ రూపురేఖలను మార్చేసిన ఇంగ్లీష్ జట్టు.. భారత్ ముందు మాత్రం తలవంచింది. తొలి మ్యాచ్‌లో గెలుపొంది మాటలతో ఓవరాక్షన్ చేసిన ఇంగ్లాండ్ ప్రత్యర్ధి ఎవరన్నది ఇంగ్లండ్ మర్చిపోయింది. అదే ఇంగ్లండ్ చేసిన పెద్ద తప్పు. రెండో టెస్టులో దెబ్బతిన్న సింహంలా భారత్ పంజా విసిరింది. భారత బౌలర్ల దెబ్బకు విధ్వంసం సృష్టించే ఇంగ్లండ్ ఆటగాళ్ల బ్యాట్‌లు మూగబోయాయి. విశాఖలో బూమ్రా దాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు వణికిపోయారు. ప్రత్యర్ధి కెప్టెన్ బెన్ స్టోక్స్ సైతం బుమ్రా బౌలింగ్‌కు ఫిదా అయిపోయాడు.
అయితే తొలి రెండు టెస్టులు ఒక లెక్క.. రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టు మరో లెక్కఇంగ్లండ్ జట్టుకు రాజ్‌కోట్ టెస్టు ఎప్పటికి గుర్తిండిపోతుంది. టీమిండియా దెబ్బకు గత 90 ఏళ్లలో ఎన్నడూ చూడని ఓటమిని ఇంగ్లండ్ చవిచూసింది. 550 పరుగుల పైగా లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు ఏ దశలోనూ కనీస పోటీ ఇవ్వలేకపోయింది.
అస్సలు మనం చూస్తుంది ఇంగ్లండ్ జట్టునేనా అన్నట్లు ఇన్నింగ్స్ సాగింది. భారత స్పిన్ వ్యూహంలో చిక్కుకుని ఇంగ్లీష్ బ్యాటర్లు విల్లావిల్లాడారు. జడేజా, కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) స్పిన్ దాటికి ఇంగ్లండ్ కేవలం 122 పరుగులకే కుప్పకూలింది. కచ్చితంగా ఈ ఓటమిపై ఇంగ్లండ్ జట్టుతో పాటు మేనెజ్‌మెంట్ ఆత్మ పరిశీలిన చేసుకోవాలి. చిత్తుగా ఓడిన ఇంగ్లండ్ జట్టుపై ఆ దేశ మాజీలు, మీడియా సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. టెస్టు క్రికెట్‌కు వైట్‌బాల్ క్రికెట్ కు తేడా ఉంటుందన్న విషయాన్ని ఇంగ్లండ్ ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిదని అభిప్రాయపడుతున్నారు. అన్నిసార్లూ బజ్ బాల్ కాన్సెప్ట్ వర్కౌట్ కాదన్నది స్పష్టంగా తేలిపోయింది. పరిస్థితులకు తగ్గట్టు ఆడకుండా ప్రతీసారీ బజ్ బాల్ నే నమ్ముకుంటే ఇలాగే చావుదెబ్బ తినాల్సి వస్తుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.