ఐపీఎల్ మెగా వేలం ఈ కీపర్లపై కాసుల వర్షమే
ఐపీఎల్ మెగా వేలం డిసెంబర్ లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేలానికి సంబంధించి రిటెన్షన్ రూల్స్ ను బీసీసీఐ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుండగా.. ఫ్రాంచైజీలు మాత్రం తమ తమ వ్యూహాల్లో బిజీగా ఉన్నాయి.

xr:d:DAFp2KNID3s:3,j:7012502471275391395,t:23072716
ఐపీఎల్ మెగా వేలం డిసెంబర్ లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేలానికి సంబంధించి రిటెన్షన్ రూల్స్ ను బీసీసీఐ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుండగా.. ఫ్రాంచైజీలు మాత్రం తమ తమ వ్యూహాల్లో బిజీగా ఉన్నాయి. రిటెన్షన్ కు నలుగురికి మించి అవకాశం ఉండదన్న వార్తల నేపథ్యంలో వేలంలో కొనుగోలు చేసే ప్లేయర్స్ పై ఫోకస్ పెంచాయి. ఈ సారి మెగా వేలంలో వికెట్ కీపర్లపై కాసుల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ జాబితాలో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ పేరే గట్టిగా వినిపిస్తోంది. నిజానికి ఢిల్లీ ఫ్రాంచైజీ పంత్ ను రిలీజ్ చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ చివరి నిమిషంలో ఏదైనా మార్పులు జరిగితే మాత్రం పంత్ వేలంలోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగితే ఈ యువ వికెట్ కీపర్ భారీ ధర పలకడం ఖాయం. ధోనీ స్థానాన్ని భర్తీ చేసే సత్తా ఉన్న ప్లేయర్ గా ప్రశంసలు అందుకుంటున్న పంత్ కోసం ఫ్రాంచైజీలు గట్టిగా ప్రయత్నించే ఛాన్సుంది.
అలాగే మరో యువ వికెట్ కీపర్ ధృవ్ జురెల్ కూడా భారీ ధరకు అమ్ముడయ్యే అవకాశాలున్నాయి. జాతీయ జట్టుకు ఎక్కువ ఆడకున్నా దేశవాళీ క్రికెట్ లో దుమ్మురేపుతున్నాడు. కీపింగ్ స్కిల్స్ తోనే కాదు బ్యాటింగ్ లోనూ ఆకట్టుకుంటున్న జురెల్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడతాయని అంచనా వేస్తున్నారు. ఇక పంజాబ్ కింగ్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న జితేశ్ శర్మకు పవర్ హిట్టర్ గా పేరుంది. గత సీజన్ లో జితేశ్ కొన్ని మెరుపు ఇన్నింగ్స్ లు కూడా ఆడాడు. కీపింగ్ స్కిల్స్ లోనూ అదరగొడుతున్న ఈ యువ వికెట్ కీపర్ కోసం పంజాబ్ తో పాటు మరికొన్ని ఫ్రాంచైజీలు గట్టిగానే పోటీపడతాయని చెబుతున్నారు.