T 20 World Cup: అమెరికాలో 2024 టీ20 ప్రపంచకప్!

2021లో టి20 ప్రపంచకప్ జరగ్గా.. 2022లో ఆస్ట్రేలియా వేదికగా మరోసారి టి20 మహా సంగ్రామం జరిగింది. ఇక ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. అలాగే వచ్చే ఏడాది టి20 ప్రపంచకప్ కూడా జరగనుంది. 2021 నుంచి ప్రపంచకప్ ఈవెంట్స్ అక్టోబర్, నవంబర్ నెలల్లో జరుగుతూ వస్తున్నాయి. అయితే 2024లో జరిగే టి20 ప్రపంచకప్ మాత్రం అక్టోబర్ నెలలో కాకుండా జూన్ లో జరిగే అవకాశం ఉన్నట్లు ప్రముఖ స్పోర్ట్స్ వెబ్ సైట్ క్రిక్ ఇన్ఫో తన నివేదికలో పేర్కొంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 29, 2023 | 12:35 PMLast Updated on: Jul 29, 2023 | 12:35 PM

The Leading Sports Website Cricinfo Has Stated In Its Report That The T20 World Cup Will Soon Be Held In America

ఆ నివేదిక ప్రకారం 2024 జూన్ 4 నుంచి 30 వరకు టి20 ప్రపంచకప్ జరగనుంది. ఈసారి ప్రపంచకప్ అమెరికా, వెస్టిండీస్ లు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఇందుకోసం అమెరికాలో ఐదు వేదికలను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. అందులో ఫ్లోరిడా, న్యూయార్క్, డల్లాస్, మోరిస్ విల్లేలు ఉన్నట్లు సమాచారం. ఇక మరో ఐదు వేదికలు కరీబియన్ దీవుల్లో ఉండనున్నాయి. ఐపీఎల్ 2024 ముగిసిన వెంటనే టి20 ప్రపంచకప్ ఉండనున్నట్లు సమచారం.

ఇక ఈసారి ప్రపంచకప్ లో 20 జట్లు పాల్గొంటున్నాయి. గత ఎడిషన్ లా క్వాలిఫయర్ రౌండ్ ఉండబోదు. 20 జట్లను.. నాలుగు జట్ల చొప్పున ఐదు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్ లోనూ ఒక జట్టు మిగిలిన మూడు జట్లతో ఒక్కోసారి ఆడుతుంది. ప్రతి గ్రూప్ లో టాప్ 2లో నిలిచిన 8 జట్లు సూపర్ 8కు అర్హత సాధిస్తాయి. సూపర్ 8లో.. నాలుగు జట్ల చొప్పున రెండు గ్రూపులగా విభజిస్తారు. ఇందులో ప్రతి జట్టు కూడా మిగిలిన మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ప్రతి గ్రూప్ నుంచి టాప్ 2లో నిలిచిన 4 జట్లు సెమీస్ కు చేరతాయి. ఫైనల్ జూన్ 30న జరిగే అవకాశం ఉంది.