KL Rahul : కెప్టెన్ కు గ్రౌండ్ లోనే క్లాస్
సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు ఘోర పరాజయం పాలైంది. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత.. గ్రౌండ్‌లోనే కేఎల్ రాహుల్‌తో చాలా ఆగ్రహంగా మాట్లాడుతూ కనిపించాడు.

The Lucknow team lost badly in the match against Sunrisers.
సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు ఘోర పరాజయం పాలైంది. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత.. గ్రౌండ్‌లోనే కేఎల్ రాహుల్‌తో చాలా ఆగ్రహంగా మాట్లాడుతూ కనిపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాహుల్ మ్యాచ్ గురించి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నా.. సంజీవ్ గోయెంకా అస్సలు వినిపించుకోకుండా.. చాలా కోపంగా మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ సీన్స్ చూసిన వారంతా.. సంజీవ్ గోయెంకాను విమర్శిస్తున్నారు. ఒక టీమిండియా ఆటగాడిని, జట్టు కెప్టెన్ ను ఇలా గ్రౌండ్‌లోనే మ్యాచ్ గురించి నిందించడం సరికాదంటూ మండిపడుతున్నారు. ఈ మ్యాచ్ ఓడిపోయినా.. లక్నోకు ఇంకా ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎంత టీమ్‌కు ఓనర్ అయినంత మాత్రనా.. ఒక ప్లేయర్‌తో ఇలానేనా మాట్లాడేది అంటూ మండిపడుతున్నారు.