IPL 2025 Kavya Maran : రిటెన్షన్ రూల్స్ మార్చాల్సిందే.. తగ్గేదే లే అంటున్న కావ్యా పాప
ఐపీఎల్ (IPL) ఫ్రాంచైజీలతో బీసీసీఐ (BCCI) నిర్వహించిన సమావేశం వాడివేడిగా జరిగింది. మరి కొన్ని నెలల్లో జరగనున్న ఐపీఎల్ మెగా వేలం నిబంధనలు ఖరారు చేయడానికి ముంబైలో ఈ మీటింగ్ జరిగింది.

The meeting held by BCCI of IPL franchises was heated.
ఐపీఎల్ (IPL) ఫ్రాంచైజీలతో బీసీసీఐ (BCCI) నిర్వహించిన సమావేశం వాడివేడిగా జరిగింది. మరి కొన్ని నెలల్లో జరగనున్న ఐపీఎల్ మెగా వేలం నిబంధనలు ఖరారు చేయడానికి ముంబైలో ఈ మీటింగ్ జరిగింది. అయితే అన్ని ఫ్రాంచైజీలు ఒక నిర్ణయంపై ఏకాభిప్రాయానికి రాలేదు. ఒక్కో ఫ్రాంచైజీ తమ అభిప్రాయాలను భిన్నంగా వెల్లడించాయి. వీటిపై బీసీసీఐ (BCCI) తుదినిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఐపీఎల్-బీసీసీఐ (IPL-BCCI) సమావేశంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) సీఈవో (CEO) కావ్య మారన్ (Kavya Maran) కీలక సూచనలు చేయడంతో పాటు తన అభిప్రాయాలు స్పష్టంగా వెల్లడించారు. రిటైన్డ్ లిస్ట్ లేదా రైట్ టూ మ్యాచ్ కార్డ్ విధానాలతో కలిపి మొత్తంగా ఆరుగురు ఆటగాళ్లను ఫ్రాంచైజీతో ఉంచుకునేలా రూల్ మార్చాలని కోరారు. అలాగే రిటైన్డ్ లిస్ట్‌లో విదేశీ ప్లేయర్లకు పరిమితి విధించకూడదని చెప్పారు.
అయితే వేలంలో కొనుగోలు చేసిన తర్వాత అందుబాటులో ఉండని విదేశీ ప్లేయర్లను నిషేధించాలని కావ్య మారన్ గట్టిగా చెప్పినట్టు తెలుస్తోంది. గాయం పేరుతో విదేశీ ప్లేయర్లు అందుబాటులో లేని సందర్భాలు చాలానే ఉన్నాయని వ్యాఖ్యానించింది. లంక ప్లేయర్ హసరంగను ఉద్దేశిస్తూ కావ్య మారన్ ఈ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. గతంలో 10 కోట్లు పలికిన హసరంగాను సన్ రైజర్స్ లో 2023లో 1.5 కోట్లకు దక్కించుకుంది. తక్కువ ధర పలకడంతోనే అతను గాయం పేరుతో తప్పుకున్నాడని సమాచారం.