ఈడెన్ లోనే ధనాధన్ స్టార్ట్ ఆ రెండింటి మధ్యే తొలి మ్యాచ్
క్రికెట్ ఫ్యాన్స్ కు రాబోయే మూడు నెలలు ఫెస్టివల్ అనే చెప్పాలి.. మహిళల ఐపీఎల్ తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ అలరించనుండగా.. ఇవి ముగిసిన వెంటనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ కూడా మొదలవుతుంది.

క్రికెట్ ఫ్యాన్స్ కు రాబోయే మూడు నెలలు ఫెస్టివల్ అనే చెప్పాలి.. మహిళల ఐపీఎల్ తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ అలరించనుండగా.. ఇవి ముగిసిన వెంటనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ కూడా మొదలవుతుంది. ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న ఐపీఎల్ కోసం ఫ్యాన్స్ ఎప్పుడూ ఆసక్తిగానే ఎదురుచూస్తుంటారు. ఈ సారి ప్రతీ టీమ్ కాంబినేషన్ మారిపోవడంతో ఉత్కంఠ పెరిగిపోతోంది. తాజాగా ఐపీఎల్ సీజన్ షెడ్యూల్ కు సంబంధించి కొన్ని వివరాలు బయటకొచ్చాయి. మ్యాచ్‌ల తేదీలను బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. కొన్ని ముఖ్యమైన మ్యాచ్‌ల తేదీలు, వాటి వేదికల గురించి క్రిక్ బజ్ వెల్లడించింది.ఐపీఎల్ 2025 మార్చి 22న ఆరంభం కాబోతుందనే వార్తలు వస్తున్నాయి. తొలి మ్యాచ్ లో ఢిపెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడబోతున్నాయని సమాచారం.
ఫైనల్ మ్యాచ్ మే 25 ఆదివారం జరగనుందని తెలుస్తోంది. ఈ రెండు మ్యాచులు డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్ కతా హోం గ్రౌండ్ లో నిర్వహిస్తారు. కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య మొదటి మ్యాచ్ జరగగా.. ఆ మరుసటి రోజే, గత సీజన్ రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ – రాజస్థాన్ రాయల్స్ మధ్య మార్చి 23 ఆదివారం రెండో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సన్ రైజర్స్ హోమ్ గ్రౌండ్.. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. గత ఐపీఎల్ సీజన్ లో ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ పరుగుల విధ్వంసం గురించి తెలిసిందే. దీంతో ఈ సారి ఈ స్టేడియంలో సన్ రైజర్స్ మ్యాచ్ ల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.
మొత్తంగా ఈ సీజన్ లోని అన్ని మ్యాచులు 12 వేదికల్లో నిర్వహించనున్నారు. అహ్మాదాబాద్, ముంబయి, చెన్నై, బెంగళూరు, లఖ్ నవూ, ముల్లాన్ పూర్, దిల్లీ, జైపుర్, కోల్ కతా, హైదరాబాద్, గుహావటి, ధర్మశాలలో మ్యాచ్ లు జరగనున్నాయి. 10 ఫ్రాంఛైజీల చెందిన వేదికలతో పాటు ఈ సారి అదనంగా ధర్మశాల, గువాహతి లో కూడా మ్యాచ్ లు నిర్వహించబోతున్నారని సమాచారం. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ కు సంబంధించిన మూడు మ్యాచులు నిర్వహించనున్నారు. ఇక హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో రెండు ప్లే-ఆఫ్ మ్యాచ్‌లు క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్… జరగనుండగా…క్వాలిఫయర్ 2, ఫైనల్ మ్యాచ్ కు కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది. వచ్చే వారం బీసీసీఐ ఐపీఎల్ షెడ్యూల్ ను అధికారికంగా ప్రకటించనుందని బోర్డు వర్గాలు తెలిపాయి.