Paris Olympics PV Sindhu : పీవీ సింధు చీరపై వివాదం..
పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు అదిరిపోయాయ్. ఈ ఈవెంట్‌లో ఇండియన్ స్టార్ షట్లర్ సింధు.. ఫ్లాగ్ బేరర్‌గా గౌరవాన్ని సాధించింది.

The opening ceremonies of the Paris Olympics are over. In this event, Indian star shuttler Sindhu got the honor of being the flag bearer.
పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు అదిరిపోయాయ్. ఈ ఈవెంట్‌లో ఇండియన్ స్టార్ షట్లర్ సింధు.. ఫ్లాగ్ బేరర్‌గా గౌరవాన్ని సాధించింది. మువ్వన్నెల చీరలో భారత పతాకాన్ని చేతిలో పట్టుకొని.. ఇండియన్ అథ్లెట్ల టీమ్‌కు సారథ్యం వహించింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. ఐతే ఒలింపిక్స్ వేదికపై సింధు ధరించిన చీరపై ఇప్పుడు కొత్త దుమారం రేగుతోంది. తరుణ తహిలియానీ డిజైన్ చేసిన దుస్తులు.. చాలా పేలవంగా ఉన్నాయంటూ బెంగళూరుకు చెందిన రచయిత డాక్టర్ నందితా అయ్యర్ పెట్టిన పోస్ట్ ఇప్పుడీ కాంట్రవర్సీకి కారణం అవుతోంది.
ఈ యూనిఫామ్‌ల కంటే మెరుగైన చీరలు.. 2వందల రూపాయలకు ముంబై వీధుల్లో అమ్మడం చూశాననని.. చౌకైన పాలిస్టర్ వస్త్రంతో, త్రివర్ణమనే ఊహకు అందకుండా గజిబిజిగా అద్దిన రంగులతో అధ్వాన్నంగా ఉందంటూ విమర్శించారు. ఇంటర్న్‌కి అవుట్‌సోర్స్ చేశారా.. లేదంటే చివరి 3నిమిషాల్లో హడావిడిగా డిజైన్ చేశారా అంటూ ఫైర్ అయ్యారు. భారతదేశ సుసంపన్నమైన… నేత సంస్కృతికి, చరిత్రకు ఇది అవమానం అటూ నందితా ఆవేదన వ్యక్తం చేశారు. ఐతే ఈ డిజైనర్ దుస్తులను ధరించిన క్రీడాకారిణి పట్ల తనకు ఎలాంటి అగౌరవం లేదని వివరణ ఇచ్చారు.
ఇదంతా ఎలా ఉన్నా.. ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారిగా పారిస్‌లో, నదిలో జరిగిన సంబరాలు ప్రతీ ఒక్కరిని ఆకట్టుకున్నాయ్. పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ శరత్ కమల్ భారతీయ జెండా బేరర్లుగా వ్యవహరించారు. ఈ ఈవెంట్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు థామస్ బాక్ సహా అథ్లెట్లు ఇందులో పాల్గొన్నారు.
Paris 2024, flag bearer—one of the greatest honors of my life to hold our country’s flag in front of millions ❤️ pic.twitter.com/4VPc9FFuIz
— Pvsindhu (@Pvsindhu1) July 26, 2024