Shubman Gill: వాడే వారసుడు
డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి అనంతరం వచ్చే 2023-25 టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు రోహిత్ శర్మ టీమిండియాకు నాయకత్వం వహిస్తాడా.? లేదా.? అనేది ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న.

The select committee thinks Shubman Gill has the captain of the Indian cricket team
ఒకవేళ రోహిత్ శర్మ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా.. అతడి స్థానంలో కొత్త కెప్టెన్ ఎవరవుతారు.? హిట్‌మ్యాన్ వారుసుడు ఎవరు.? దీనిపై బీసీసీఐ అధికారి ఒకరు పెదవి విప్పారు. టెస్టు కెప్టెన్సీని త్వరలోనే విధ్వంసకర ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలిపారు. ఒకేవేల టెస్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ తప్పుకున్నట్లయితే.. అతడి స్థానంలో జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ లాంటి ప్లేయర్స్ లైనప్‌లో ఉన్నారు. అయితే ఈ ముగ్గురు ఆటగాళ్లు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య వారి ఫిట్‌నెస్.
బుమ్రా నిత్యం గాయపడుతూనే ఉన్నాడు. శ్రేయాస్ అయ్యర్‌ది కూడా అదే సమస్య. ఇక రిషబ్ పంత్ తన ఫిట్‌నెస్‌ను ఎప్పుడు తిరిగి సాధిస్తాడన్నది ఇప్పుడు చిక్కు ప్రశ్న. వీరే కాకుండా అజింక్యా రహానే జట్టులో పునరాగమనం చేసినా అతడి వయసు 35 ఏళ్లు. ఛతేశ్వర్ పుజారా సీనియర్ ఆటగాడే అయినా జట్టులో అతడి స్థానం ప్రమాదంలో పడింది. అశ్విన్‌కి ప్రతి మ్యాచ్‌లో అవకాశం ఇవ్వట్లేదు. దీంతో ఫిట్‌నెస్, ఫామ్, ఏజ్ పరంగా చూసుకుంటే.. శుభ్‌మాన్ గిల్‌కే ఓటు వెయ్యొచ్చు బీసీసీఐ అధికారులు. మరో గిల్ అండర్-19 స్థాయిలో కెప్టెన్‌గా వ్యవహరించలేదు లేదా ఇండియా ఎ జట్టుకు నాయకత్వం వహించలేదు. రంజీలోనూ ఏ జట్టుకు కెప్టెన్ కాదు.
కానీ అతడు మాత్రం 2018లో అండర్-19 ప్రపంచకప్ జట్టుకు వైస్ కెప్టెన్. అలాగే, గిల్‌కి గేమ్‌పై లోతైన అవగాహన ఉంది. పరిస్థితులకు అనుగుణంగా ఎలా ఆడాలో కూడా తెలుసు. అయితే అతడ్ని ముందుగా కెప్టెన్ చేసే బదులు.. రోహిత్ శర్మ కింద వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేస్తే.. మరికొంత ఆటపై అవగాహన రావచ్చు. కాగా, గత ఏడాదిలో, గిల్ మొత్తం మూడు ఫార్మాట్లలో 38 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇందులో అతడి బ్యాట్‌తో 7 సెంచరీలు, 5 అర్ధ సెంచరీలు సాధించాడు. అలాగే గిల్ సగటు 55 కంటే ఎక్కువగా ఉంది. విరాట్ కోహ్లి తర్వాత టీమిండియా తదుపరి అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ గిల్ అని చాలామంది క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.