Rohith Sharma: రోహిత్ ను మెల్లిగా సైడ్ చేస్తున్నారా? విండీస్ టూర్ కి కెప్టెన్ కు మొండిచేయి
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఓటమి తర్వాత భారత జట్టుకు నెల రోజుల బ్రేక్ లభించింది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన కుటుంబంతో కలిసి హాల్‌డే ట్రిప్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ హిట్‌మ్యాన్ షేర్ చేశాడు. ఇక ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న భారత జట్టు వచ్చే నెలలో వెస్టిండీస్‌తో జరిగే మల్టీ ఫార్మాట్ సిరీస్‌తో మళ్లీ ఫీల్డ్‌లో అడుగుపెట్టనుంది. విండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. జూలై 12న డొమినికా వేదికగా జరగనున్న తొలి టెస్టుతో భారత టూర్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మకు విండీస్ సిరీస్‌లో కొంత భాగంగా విశ్రాంతి ఇవ్వాలని సెలక్టర్లు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
“ఐపీఎల్‌లో తర్వాత జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రోహిత్ శర్మ అంతగా రాణించలేకపోయాడు. అతడు తన రిథమ్‌ను కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. అందుకే అతడికి వెస్టిండీస్ టూర్‌లో కొంత భాగమైనా విశ్రాంతి ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు. అయితే అతడికి టెస్టులకు విశ్రాంతినివ్వాలో లేక వైట్‌బాల్ సిరీస్‌కు ఇవ్వాలో సెలక్టర్లు ఇంకా నిర్ణయించలేదు. ఈ విషయంలో రోహిత్‌తో మాట్లాడిన తర్వాతే సెలెక్టర్లు ఒక నిర్ణయానికి వస్తారు’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అయితే మరో స్టార్ ఆటగాడు కోహ్లి పరిస్థితి ఎంటో ఇంకా తెలియదు. అతడికి కూడా సెలక్టర్లు విశ్రాంతిని ఇస్తారో లేదా మూడు సిరీస్‌లకు కూడా ఎంపిక చేస్తారో వేచి చూడాలి. విండీస్‌తో సిరీస్‌లకు భారత జట్టును జూన్ 26న ప్రకటించే ఛాన్స్ ఉంది.