Surya Kumar Yadav: యాదవ్ బతుకు ఆగమాగం ఏదో ఒక్క ఫార్మాట్ కి ఫిక్స్ చేయలేరా?
డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన అనంతరం టీమ్‌ఇండియా దాదాపు నెలరోజుల విరామం తర్వాత విండీస్ పర్యటనతో తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనుంది.

The selectors who have selected Team India for the game against West Indies are criticizing Surya Kumar Yadav
ఈ పర్యటనలో వెస్టిండీస్‌తో భారత్ రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. టెస్టులు, వన్డేలకు ఇటీవల సెలెక్షన్ కమిటీ జట్లను ప్రకటించింది. నిలకడగా రాణించలేకపోతున్న ఛెతేశ్వర్‌పై వేటు వేసిన సెలెక్టర్లు.. యువ ఆటగాళ్లయిన రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్‌లకు జట్టులో చోటు కల్పించారు. 30 ఏళ్ల బెంగాల్ పేసర్ ముఖేశ్‌కుమార్‌ను వన్డేలు, టెస్టులకు ఎంపిక చేశారు. అయితే, జట్టు ఎంపిక చేసిన తీరుపై సెలెక్షన్ కమిటీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో అరంగేట్రం చేసి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు స్టాండ్ బైగా ఉన్న సూర్యకుమార్ యాదవ్ కు సెలెక్టర్లు మొండిచేయి చూపారు.
యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ను వన్డే జట్టులోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో భారత సెలెక్టర్లపై టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా విమర్శలు గుప్పించాడు. ‘‘సూర్యకుమార్ యాదవ్‌ను టెస్టులకు అడపాదడపా ఎంపిక చేయడంపై మీ విధానమేంటి? ఒకసారి ఎంపిక చేస్తారు.. మరోసారి తప్పిస్తారు. అతడు టెస్టు జట్టు పరిశీలనలో ఉన్నాడా లేడా?. అర్ష్‌దీప్ సింగ్‌ను వన్డేలకు ఎందుకు ఎంపిక చేయలేదు. అతడు ఫిట్‌గా లేడా?’ అని ఆకాశ్ చోప్రా ప్రశ్నించాడు. జులై 12 నుంచి 24 వరకు రెండు టెస్టుల సిరీస్, జులై 27 నుంచి ఆగస్టు 01 వరకు మూడు వన్డేల సిరీస్, ఆగస్టు 03 నుంచి 13 వరకు ఐదు టీ20 సిరీస్ జరగనుంది. టీ20లకు ఇంకా జట్టును ప్రకటించలేదు.