Commonwealth Games: కంగారూ దేశానికి.. కంగారు పెడుతున్న కామన్వెల్త్ గేమ్స్
ఒలింపిక్స్ తర్వాత అత్యంత ప్రాధాన్యమున్న టోర్నీ కామన్‌వెల్త్ గేమ్స్. కాగా నాలుగేళ్లకోసారి నిర్వహించే కామన్‌వెల్త్ గేమ్స్‌ను 2026లో ఆస్ట్రేలియాలోని విక్టోరియా స్టేట్ వేదిక కానుంది. కానీ తాజాగా తాము కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహించలేమని విక్టోరియా స్టేట్ తేల్చి చెప్పింది. అనుకున్నదాని కంటే బడ్జెట్ ఎక్కువైతుందని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత బడ్జెట్‌తో కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహించడం తమకు సాధ్యం కాదని పేర్కొంది.

Victoria State Held On Common wealth Games in 2026
గేమ్స్ నిర్వహణ నుంచి తాము తప్పుకుంటున్నట్లు ఇప్పటికే కామన్‌వెల్త్ గేమ్స్ అథారిటీకి సమాచారమిచ్చామని.. మా కాంట్రాక్ట్‌ను రద్దు చేసి వేరే వాళ్లకు ఇవ్వడం మంచిదని కోరినట్లు విక్టోరియా స్టేట్ ప్రతినిధులు తెలిపారు. విక్టోరియా స్టేట్ ప్రీమియర్ డానియెల్ ఆండ్రూస్ మెల్‌బోర్న్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. ”మొదట కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహణకు బడ్జెట్‌లో రెండు ఆస్ట్రేలియన్ బిలియన్ డాలర్స్ కేటాయించాం. కానీ ఇప్పుడు చూస్తే అది ఏడు ఆస్ట్రేలియ బిలియన్ డాలర్లు అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితిలో మాకు ఇది కష్టంగా అనిపిస్తోంది. అసలే లోటు బడ్జెట్‌తో కొట్టుమిట్టాడుతున్న మాకు కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహణ భారంగా మారే అవకాశం ఉంది. ఒక ఆసుపత్రి లేదా స్కూల్స్ నిర్వహణకు ఖర్చు చేయాల్సిన దానిని ఇలా కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహణకు వినియోగించలేం.. ఇది మాకు మూడింతల బడ్జెట్” అని నిర్వాహకులు తెలిపారు.