Pakistan cricket : ఆట తక్కువ.. తీట ఎక్కువ..
పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం, పీసీబీ అధ్యక్షుడు జాక్ అష్రఫ్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ లీక్ కేసు పాకిస్థాన్ క్రికెట్‌లో పెను దుమారం రేపడమే కాకుండా రోజురోజుకు సరికొత్త మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా పాకిస్థాన్ బోర్డు ప్రెసిడెంట్ జాక్ అష్రాఫ్ ఈ చర్యపై పాక్ జట్టు మాజీ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

The WhatsApp chat leak case between Pakistan cricket team captain Babar Azam and PCB president Jack Ashraf is a big scandal in Pakistan cricket
పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం, పీసీబీ అధ్యక్షుడు జాక్ అష్రఫ్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ లీక్ కేసు పాకిస్థాన్ క్రికెట్‌లో పెను దుమారం రేపడమే కాకుండా రోజురోజుకు సరికొత్త మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా పాకిస్థాన్ బోర్డు ప్రెసిడెంట్ జాక్ అష్రాఫ్ ఈ చర్యపై పాక్ జట్టు మాజీ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అతని లైన్‌లో జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కూడా చేరాడు. జకా అష్రాఫ్‌ను దృష్టిలో పెట్టుకుని, కీలక వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఈ వ్యవహారం సరికొత్త మలుపులు తిరుగుతోంది. అఫ్రిదీ మాట్లాడుతూ.. మీ పనిపై దృష్టి పెట్టండి. జట్టు ప్రపంచకప్ ఆడుతున్నప్పుడు మీరు ఆటగాళ్ల గురించి జట్టు కెప్టెన్ గురించి ప్రకటనలు చేస్తున్నారు. మొదట మీరు మీ గౌరవాన్ని నిలబెట్టుకోండి. క్రికెటర్లుగా మేం మీ నుంచి ఆశించేది ఇదే. ప్రజలు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాటిని పక్కన పెట్టి, మీరు వారికి మాట్లాడే అవకాశం ఇస్తున్నారు. దయచేసి మీ పని ఏంటో మీరు చూసుకోండి అంటూ జకా అష్రాఫ్‌పై అఫ్రిది విరుచుకుపడ్డాడు.