అప్పుడు రాహుల్..ఇప్పుడు పంత్ కెప్టెన్లపై లక్నో ఓనర్ ఫైర్

ఐపీఎల్ అంటేనే కమర్షియల్ లీగ్... ఫ్రాంచైజీ ఓనర్లు కోట్లాది రూపాయలు ఆటగాళ్ళపై పెట్టుబడి పెడుతుంటారు... తమ అంచనాలకు తగ్గట్టే విజయాలను ఆశిస్తుంటారు... కానీ గెలిచే మ్యాచ్ చేజారినప్పుడు కోపం వచ్చినా దానిని బహిరంగంగా మాత్రం వ్యక్తపరచకూడదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 25, 2025 | 04:06 PMLast Updated on: Mar 25, 2025 | 4:06 PM

Then Rahul Now Pant Lucknow Owner Fires At Captains

ఐపీఎల్ అంటేనే కమర్షియల్ లీగ్… ఫ్రాంచైజీ ఓనర్లు కోట్లాది రూపాయలు ఆటగాళ్ళపై పెట్టుబడి పెడుతుంటారు… తమ అంచనాలకు తగ్గట్టే విజయాలను ఆశిస్తుంటారు… కానీ గెలిచే మ్యాచ్ చేజారినప్పుడు కోపం వచ్చినా దానిని బహిరంగంగా మాత్రం వ్యక్తపరచకూడదు.. ఈ విషయంలో లక్నో ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా పలుసార్లు కంట్రోల్ కోల్పోతున్నాడు. హద్దు మీరి ప్రవర్తిస్తూ గ్రౌండ్ లోనే కెప్టెన్లపై కోప్పడుతున్నాడు. గత సీజన్ లో కేఎల్ రాహుల్ పై సంజీవ్ గోయెంకా అరిచిన వీడియో వైరల్ గా మారిన విషయాన్ని ఎవ్వరూ మరిచిపోలేరు. ఇప్పుడు ఢిల్లీ చేతిలో ఓటమి తర్వాత లక్నో కెప్టెన్ పంత్ పైనా దాదాపు ఇదే తరహాలో ఆగ్రహం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. పంత్ కు లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

లక్నో సూపర్‌ జెయింట్స్‌ తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక వికెట్ తేడాతో గెలిచింది. మిడిల్‌ ఆర్డర్‌ లో వచ్చిన అశుతోష్‌ శర్మ భయంకరమైన బ్యాటింగ్‌ తో చెలరేగాడు. దీంతో.. సులభంగా గెలిచే లక్నో సూపర్‌ జెయింట్స్‌… ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. అయితే ఈ ఓటమితో లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా చాలా అసంతృప్తిగా కనిపించాడు. మ్యాచ్‌ పూర్తయిన తర్వాత… లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ రిషబ్ పంత్ తో చాలా సీరియస్‌ గా ఎదో మాట్లాడినట్లు వీడియో, ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. దీంతో… కేఎల్‌ రాహుల్‌ ను గ్రౌండ్‌ లో నిలబెట్టి…తిట్టినట్లు తాజాగా పంత్ కు కూడా గ్రౌండ్ లోనే క్లాస్ పీకుతున్నట్టు అర్థమవుతోంది. తన టీమ్ కు ఎవరు కెప్టెన్ గా ఉన్నా సంజీవ్ గోయెంకా ఇలానే అవమానిస్తారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

గతంలో మహేంద్ర సింగ్‌ ధోని, కేఎల్‌ రాహుల్‌ కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. మ్యాచ్ ఓడిపోతే చాలు… మహేంద్ర సింగ్‌ ధోని, కేఎల్‌ రాహుల్‌ లపై ఆగ్రహం వ్యక్తం చేసేవాడు. ఇక గత సీజన్ లో రాహుల్ ను గ్రౌండ్ లోనే తిట్టిపోసినప్పుడు అందరూ ప్రత్యక్షంగా చూశారు. సన్ రైజర్స్ తో భారీస్కోరును కాపాడుకోవడంలో అప్పుడు లక్నో బౌలర్లు విఫలమయ్యారు. దీంతో మ్యాచ్ ముగిసిన తర్వాత బౌండరీ లైన్ దగ్గరే రాహుల్ కు సంజీవ్ గోయెంకా క్లాస్ పీకాడు. పలు కెమెరాల్లో ఇది స్పష్టంగా రికార్డయింది. చాలా మంది గోయెంకా తీరును తప్పుపట్టారు. ఫ్రాంచైజీ ఓనర్ గా కోపం, బాధ ఉండడం సహజమే అయినా మీటింగ్ పెట్టుకుని ఇన్ సైడ్ మాట్లాడుకోవాలని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ గొడవ తర్వాతే రాహుల్ ఆ ఫ్రాంచైజీకి గుడ్ బై చెప్పేశాడు. ఇప్పటికైనా సంజీవ్ గోయెంకా ఇలా పబ్లిక్ గా కెప్టెన్లపై కోప్పడి వాళ్ళని అవమానించొద్దని పలువురు సూచిస్తున్నారు.