CSK : చెన్నై ప్లే ఆఫ్ చేరుతుందా ?

ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ లో ముందు గుర్తొచ్చేది చెన్నై జట్టే... అయితే ఈ సీజన్ లో మాత్రం ప్లే ఆఫ్ రేసులో కాస్త వెనుకబడింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 13, 2024 | 10:56 AMLast Updated on: May 13, 2024 | 10:56 AM

There Is Talk That Chennai Will Reach The Playoffs

 

 

 

ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ లో ముందు గుర్తొచ్చేది చెన్నై జట్టే… అయితే ఈ సీజన్ లో మాత్రం ప్లే ఆఫ్ రేసులో కాస్త వెనుకబడింది. మరి చెన్నై ప్లే ఆఫ్ చేరుతుందా అనే చర్చ జరుగుతోంది. రేసులో ఉన్న మూడు జట్లల్లో సీఎస్కేనే కాస్త మెరుగైన స్థితిలో ఉంది. ఢిల్లీ , బెంగుళూరుతో పోల్చుకుంటే.. నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంది. ఇప్పటి వరకూ ఆ జట్టు 12 మ్యాచ్ లు ఆడి 6 విజయాలతో 12 పాయింట్ల సాధించింది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్ తోనూ ,మే 18న ఆర్సీబీతో చెన్నై తలపడనుంది.

ఈ రెండు మ్యాచ్ లు గెలిస్తే.. సీఎస్కేకి గరిష్ఠంగా 16 పాయింట్లు వస్తాయి. ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ కు చేరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. రెండు మ్యాచ్ ల్లో ఒక్కటే గెలిచినా ఎల్లో టీమ్ ప్లేఆఫ్ కు చెరిచ్చు. కానీ.. ఢిల్లీ ఓడిపోవాలని కోరుకోవాలి. ఒకవేళ చెన్నై జట్టు రెండు మ్యాచ్ ల్లో ఓడిపోతే మాత్రం.. టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే.