అక్కడే ఆరంభ వేడుకలు , రోహిత్ వెళ్ళడం డౌటే

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గర పడుతోంది. ఆతిథ్య దేశం పాకిస్థాన్ తమ స్టేడియాల ఆధునీకరణలో బిజీగా ఉంది. మిగిలిన ఏర్పాట్ల విషయంలోనూ వేగంగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా భారీ ఎత్తున ఆరంభ వేడుకలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలువురు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 31, 2025 | 07:09 PMLast Updated on: Jan 31, 2025 | 7:09 PM

There Is The Opening Ceremony Rohit Is Doubtful To Go

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గర పడుతోంది. ఆతిథ్య దేశం పాకిస్థాన్ తమ స్టేడియాల ఆధునీకరణలో బిజీగా ఉంది. మిగిలిన ఏర్పాట్ల విషయంలోనూ వేగంగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా భారీ ఎత్తున ఆరంభ వేడుకలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను కూడా సంప్రదించినట్టు సమాచారం. ఓపెనింగ్ సెర్మనీ ఫిబ్రవరి 16న లాహోర్ లో నిర్వహించేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనిపై ఐసీసీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉందని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. ఆ కథనం ప్రకారం లాహోర్ గవేదికగా ఆరంభ వేడుకలు ఏర్పాటు చేస్తోంది. ఓపెనింగ్ సెర్మనీలో కొన్ని కల్చరల్ ఈవెంట్స్ తో పాటు కెప్టెన్లతో ఫోటో షూట్, తర్వాత వారితో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతోంది. అయితే ఆరంభ వేడుకల్లో పాల్గొనేందుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ వెళ్ళడంపై స్పష్టత లేదు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం భారత సారథి పాక్ వెళ్ళే అవకాశం లేదు.

కెప్టెన్ల ప్రెస్ మీట్ లోపాల్గొనాలన్న ఖచ్చితమైన నిబంధన ఏమీ లేదన్నది బీసీసీఐ వర్గాల మాట. ఒకవేళ ఒక జట్టు సారథిగా అతని స్పీచ్ కావాలనుకుంటే మాత్రం దుబాయ్ లోనే షూట్ చేసి ఓపెనింగ్ సెర్మనీలో స్టేజ్ పై టెలికాస్ట్ చేయొచ్చు. పాక్ తో మన ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా తెగిపోవడంతో అక్కడికి వెళ్ళేందుకు భారత్ నిరాకరించింది. ఈ కారణంగానే హైబ్రిడ్ మోడల్ ను పాటిస్తూ టీమిండియా మ్యాచ్ లకు దుబాయ్ ను వేదికగా నిర్ణయించారు. ఒకవేళ భారత్ సెమీస్, ఫైనల్స్ కు చేరినా దుబాయ్ లోనే ఆడుతుంది. దీని ప్రకారం చూస్తే రోహిత్ శర్మ ఓపెనింగ్ సెర్మనీ కోసం కూడా పాక్ వెళ్లకపోవచ్చు.

మరోవైపు ఆరంభ వేడుకల కోసం పాక్ క్రికెట్ బోర్డు భారీ ఏర్పాట్లే చేస్తోంది. రాజకీయ, సినీ ప్రముఖులు , మాజీ క్రికెటర్లను ఓపెనింగ్ సెర్మనీకి ఆహ్వానించబోతోంది. ఇదిలా ఉంటే స్టేడియాల ఆధునీకరణ పనులు నెమ్మదిగా సాగుతున్నట్టు తెలుస్తోంది. కరాచీ, రావల్పిండి స్టేడియాల్లో మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. రెన్నోవేషన్ పనులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో పాక్ లో అసలు టోర్నీ జరుగుతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ టోర్నీ నిర్వహణపై అనుమానాలు వద్దని పాక్ క్రికెట్ బోర్డు చెబుతోంది.