రేసు మామూలుగా లేదు సెమీస్ చేరే జట్లు ఇవే
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైంది. పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగాటోర్నీ హైబ్రిడ్ మోడల్ లో జరుగుతోంది. భారత్ మ్యాచ్ లన్నీ దుబాయ్ లో జరగనుండగా..మిగిలిన మ్యాచ్ లకు పాక్ ఆతిథ్యమిస్తోంది.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైంది. పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగాటోర్నీ హైబ్రిడ్ మోడల్ లో జరుగుతోంది. భారత్ మ్యాచ్ లన్నీ దుబాయ్ లో జరగనుండగా..మిగిలిన మ్యాచ్ లకు పాక్ ఆతిథ్యమిస్తోంది. వన్డే ర్యాంకింగ్స్ టాప్ 8 టీమ్స్ ఆడుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ జట్టును తక్కువ అంచనా వేయలేని పరిస్థితి ఉంది. టైటిల్ రేసులో భారత్ , ఆసీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ కాస్త ముందున్నా… మిగిలిన జట్లలో ఎవరినీ తేలిగ్గా తీసుకోలేం. సంచలనాల బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు కూడా తమదైన రోజున పెద్ద జట్లకు షాకిస్తాయన్న అంచనాలున్నాయి. అయితే ఈ మెగా టోర్నీలో సెమీఫైనల్ చేరే జట్లపై చర్చ జరుగుతోంది.
గ్రూప్ ఎలో భారత్ , పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉండగా… టాప్ 2లో ఎవరు నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. గ్రూప్-ఏ నుంచి భారత్ కచ్చితంగా సెమీస్ చేరుతుందని చాలా మంది ధీమాగా చెబుతున్నారు.. ప్రస్తుతం టీమిండియా సూపర్ ఫామ్‌లో ఉంది. ఇటీవలే ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. కోహ్లీ, రోహిత్ ఫామ్‌లోకి రావడం భారత్‌కు అడ్వాంటేజ్. మహమ్మద్ షమీ సత్తా చాటితే టీమిండియాకు తిరుగుండదు. బుమ్రా లేకపోవడం మినహా టీమిండియాకు ఎలాంటి సమస్యలు లేవు. బంగ్లాతో పాటు పాక్, కివీస్ లపై గెలిచే సత్తా ఉన్న జట్టు మనదే.
గ్రూప్-ఏ నుంచి రెండో సెమీస్ బెర్త్ కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య పోటీ నెలకొంది. పాక్ గడ్డపై ముక్కోణపు సిరీస్ గెలిచి న్యూజిలాండ్ మంచి ఫామ్ లో ఉంది. ఈ సిరీస్‌లో పాకిస్థాన్‌తో రెండు సార్లు తలపడిన కివీస్ రెండింటికి రెండు మ్యాచ్‌లు గెలిచింది. ఇరు జట్ల మధ్య ఈ రోజు జరిగే మ్యాచ్‌లో గెలిచే జట్టుకే సెమీస్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. న్యూజిలాండ్‌కే ఎక్కువ అవకాశాలున్నా.. ఆతిథ్య పాకిస్థాన్‌ను తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే ఆతిథ్య దేశంగా పాక్.. తమకు అనుకూలంగా పిచ్‌లను తయారు చేసుకొని ఆడుతోంది. పైగా ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని జట్టుగా పేరున్న పాక్ సెమీస్ చేరే అవకాశాలను కొట్టిపారేయలేం. ఇదే గ్రూప్ లో మరో టీమ్ బంగ్లాదేశ్ సంచలన విజయాలు సాధించినా.. సెమీస్ చేరే బలం అయితే లేదు.
గ్రూప్-బీ నుంచి సెమీస్ రేసు కోసం సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య తీవ్ర పోటీ ఉండనుంది. ఇంగ్లండ్ కంటే సౌతాఫ్రికా, ఆసీస్ బలంగా కనిపిస్తున్నాయి. సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. రెండో సెమీస్ బెర్త్ కోసం ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య పోటీ నెలకొననుంది. ఆస్ట్రేలియాకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.గాయాలతో పలువురు స్టార్ ప్లేయర్స్ దూరమైనా ఐసీసీ టోర్నీల్లో మెరుగైన రికార్డ్ ఉంది. అఫ్గానిస్థాన్‌ను కూడా తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. ఓవరాల్ గా భారత్, న్యూజిలాండ్ , ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీఫైనల్ చేరతాయన్నది ఎక్కువమంది అంచనా.