T20 World Cup, Gavaskar’s : టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీస్ చేరే జట్లు ఇవే.. గవాస్కర్ అంచనాతో ఫాన్స్ ఖుషీ
వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ (T20 World Cup) ను ఎలాగైనా గెలుచుకోవాలనే వ్యూహాలతో పలు జట్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే భారత జట్టు మెగా టోర్నీ (Mega tournament) కోసం అమెరికా చేరుకుంది.

These are the teams that will reach the semis of the T20 World Cup.. Fans Khushi with Gavaskar's prediction
వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ (T20 World Cup) ను ఎలాగైనా గెలుచుకోవాలనే వ్యూహాలతో పలు జట్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే భారత జట్టు మెగా టోర్నీ (Mega tournament) కోసం అమెరికా చేరుకుంది. ఈ టోర్నీకి అమెరికా (America), వెస్టిండీస్ (West Indies) సంయుక్త ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే ప్రపంచకప్ ప్రారంభంకాక ముందే సెమీ ఫైనల్స్‌కు ఏఏ జట్లు దూసుకెళ్తాయనే చర్చ మొదలైంది. బలాబలాను అంచనా వేస్తూ సెమీస్‌కు చేరే టీమ్స్‌ను కొందరు మాజీ క్రికెటర్లు ముందే అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలోనే భారత క్రికెట్ (Indian cricket) దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) ఈ ప్రపంచ కప్ లో సెమీస్ చేరే జట్ల గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. రాబోయే టీ20 ప్రపంచ కప్ (T20 World Cup) 2024 లో భారత్ తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్‌లు సెమీస్ చేరుతాయని పేర్కొన్నాడు. గత టీ20 ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లండ్ (England) జట్టు కూడా ఈ సారి కూడా సెమీస్ చేరుతుందని గవాస్కర్ అంచనా వేశాడు. ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ జట్టు రెండుసార్లు గెలుచుకుంది. అలాగే, వెస్టిండీస్ కూడా సెమీస్ చేరుతుందన్నాడు గవాస్కర్ అంచనా వేశాడు. 2021లో ఫైనల్‌లో న్యూజిలాండ్ (New Zealand) ను ఓడించి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టు కూడా టాప్-4లో నిలుస్తుందని గవాస్కర్ జోస్యం చెప్పాడు.