వాళ్ళు ఆల్ రౌండర్లురా బాబూ ఐదుగురు స్పిన్నర్లపై రోహిత్

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును ఎంపిక చేసినప్పటి నుంచి మాజీ క్రికెటర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా జట్టులో ఐదుగురు స్పిన్నర్లను తీసుకోవడం వెనుక ఎలాంటి స్ట్రాటజీ ఉందో అంటూ పలువురు సెటైర్లు వేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 21, 2025 | 02:10 PMLast Updated on: Feb 21, 2025 | 2:10 PM

They Are All Rounders Rohit On Five Spinners

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును ఎంపిక చేసినప్పటి నుంచి మాజీ క్రికెటర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా జట్టులో ఐదుగురు స్పిన్నర్లను తీసుకోవడం వెనుక ఎలాంటి స్ట్రాటజీ ఉందో అంటూ పలువురు సెటైర్లు వేశారు. దుబాయ్ పిచ్ లు మరీ అంతగా టర్న్ అవుతాయా అంటూ ప్రశ్నించారు. తాజాగా దీనికి సంబంధించి కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఐదుగురు స్పిన్నర్లను తీసుకోవడానికి కారణం ఏంటో చెప్పేశాడు. తమ బలాలకు అనుగుణంగానే జట్టును ఎంపిక చేసినట్లు చెప్పాడు. జట్టులో ఉన్నది ఐదుగురు స్పిన్నర్లు అనే అంశాన్ని తాను పరిగణలోకి తీసుకోనన్నాడు. జట్టులో ఉంది ఇద్దరు స్పిన్నర్లు మాత్రమేననీ, మరో ముగ్గురు ఆల్ రౌండర్లనీ. వారిని కేవలం స్పిన్నర్లుగానే చూడటం లేదన్నాడు. వారు బ్యాట్ తోనూ బాల్ తోనూ రాణించగలరన్నాడు. తాము జట్టు బలాలపై మాత్రమే ఫోకస్ పెట్టామనీ, అందుకు తగ్గట్టుగానే జట్టును ఎంపిక జరిగిందని రోహిత్ క్లారిటీ ఇచ్చాడు.

బ్యాటింగ్ డెప్త్ కోసమే వారిని ఎంపిక చేశామని, ఆరుగురు పేసర్లను తీసుకున్న జట్లను ఎందుకు ఇలా విమర్శించరని అసహనం వ్యక్తం చేశాడు. జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ జట్టుకు విభిన్నమైన డైమెన్షన్ అందిస్తారన్నాడు. వారితో మా బ్యాటింగ్ బలం పెరుగుతుందన్న రోహిత్ అందుకే బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ చేసే నైపుణ్యం కలిగిన ఆటగాళ్లను ఎంచుకున్నామని చెప్పుకొచ్చాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడమే తమ లక్ష్యమని రోహిత్ శర్మ తెలిపాడు. ప్రతీ ఐసీసీ టోర్నీ తమకు ముఖ్యమైనదేననీ, .జట్టుపై ఎలాంటి ఒత్తిడి లేదన్నాడు. జట్టులోని ప్రతీ ఆటగాడికి వారి బాధ్యతలపై స్పష్టత ఉందన్నాడు. గతంలో భారత్ తరఫున ఎలా ఆడామో.. ఈ టోర్నీ‌లోనూ అలానే ఆడుతాం. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో మా కుర్రాళ్లు అద్భుతంగా రాణించారన్నాడు. ఏ జట్టునూ కూడా తేలిగ్గా తీసుకోవడం లేదని రోహిత్ స్పష్టం చేశాడు.

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్ లన్నీ దుబాయ్ లోనే జరగనున్నాయి. పాక్ వెళ్ళేందుకు భారత్ నిరాకరించడంతో హైబ్రిడ్ మోడల్ ను అనుసరించి దుబాయ్ వేదికగా మన మ్యాచ్ లు జరగనున్నాయి. దుబాయ్ పిచ్ స్లో బౌలర్లకు అనుకూలిస్తుందన్న అంచనాలున్నాయి. ఈ కారణంగానే స్పిన్ ఆల్ రౌండర్లకు సెలక్టర్లు ప్రాధాన్యతనిచ్చారు . దుబాయ్ పిచ్ పై బ్యాటింగ్ అనుకున్నంత తేలిక కాదు.. అలా అని మరీ కష్టంగానూ ఉండకపోవచ్చు.