Sania Mirza : హైదరాబాదీతో మూడో పెళ్లి.. భాగ్యనగరంపై షోయబ్‌కు ఎంత ప్రేమో..
సానియా మీర్జా(Sania Mirza).. పరిచయం అవసరం లేని పేరు. టెన్నిస్ వాల్డ్(Tennis Walled)లో ఒకప్పుడు సంచలనం. ఆటతో పాటు అందంతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకుంది సానియా. తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ (Brand ambassador) కూడా ! సానియా మీర్జాని చూసి ఎంతోమంది అమ్మాయిలు టెన్నిస్ రాకెట్ పట్టారు.

Third marriage with Hyderabadi.. Shoaib's love for Bhagyanagaram...
సానియా మీర్జా(Sania Mirza).. పరిచయం అవసరం లేని పేరు. టెన్నిస్ వాల్డ్(Tennis Walled)లో ఒకప్పుడు సంచలనం. ఆటతో పాటు అందంతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకుంది సానియా. తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ (Brand ambassador) కూడా ! సానియా మీర్జాని చూసి ఎంతోమంది అమ్మాయిలు టెన్నిస్ రాకెట్ పట్టారు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది సానియా. ప్రొఫెషనల్‌గా సానియాకు తిరుగులేకున్నా.. పెళ్లి జీవితంలో మాత్రం ఎన్నో అప్ అండ్ డౌన్స్ కనిపిస్తున్నాయ్. పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది సానియా. అప్పటికే పెళ్లయి, విడాకులు తీసుకున్న షోయబ్‌ని ఏరికోరి మరీ పెళ్లి చేసుకుంది ఈ టెన్నిస్ స్టార్. వీళ్లిద్దరికీ ఇప్పుడు నాలుగేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఐతే సానియాకు డివోర్స్ ఇచ్చిన షోయబ్ మూడో పెళ్లి చేసుకున్నాడు.
అతను పెళ్లి చేసుకున్న మూడో అమ్మాయికి కూడా మన హైదరాబాద్ బ్యాక్‌గ్రౌండ్ ఉండడం.. ఆసక్తికరంగా మారింది. షోయబ్ మాలిక్ ఫస్ట్ మ్యారేజీ.. ఆయేషా సిద్దిఖీ అనే హైదరాబాదీ అమ్మాయితో జరిగింది. ఐతే ఆ తర్వాత నాలుగేళ్లలోనే ఆమెకి విడాకులిచ్చి… మరో హైదరాబాదీ అయిన సానియా మీర్జాని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరు కూడా విడిపోతారని చాలా రోజుల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయ్. ఈ మధ్యే సానియా మీర్జా పెట్టిన ఓ పోస్ట్ కూడా వైరల్‌గా మారింది. పెళ్లి కష్టం, విడాకులూ కష్టమే… రెండింటిలో ఏ కష్టాన్ని ఎంచుకోవాలో మనమే నిర్ణయంచుకోవాలి అంటూ పోస్ట్ పెట్టింది సానియా. అంతా అనుకున్నదే నిజం అయింది… షోయబ్, సానియా విడిపోయారు. పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చాడా..
విడాకులు కన్ఫార్మ్ అయ్యాయని పెళ్లి చేసుకున్నాడా అన్న సంగతి పక్కనపెడితే.. షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్నాడు. ఐతే ఈ థర్డ్ మ్యారేజీలోనూ ట్విస్ట్ ఉంది. షోయబ్ తొలి వివాహం చేసుకున్న ఆయేషా సిద్దిఖీది హైదరాబాదే. రెండో భార్య సానియాదీ హైదరాబాదే. ఇక ఇప్పుడు మనువాడిన సనా జావెద్‌ది కూడా హైదరాబాదేనట. ఆమె పూర్వీకులు హైదరాబాద్‌కి చెందినవాళ్లే. దేశవిభజన సమయంలో ఇక్కడి నుంచి వెళ్లి పాకిస్తాన్‌లో స్థిరపడ్డారట. మొత్తం షోయబ్ మాలిక్ మూడు పెళ్లిళ్లకీ హైదరాబాద్‌తో లింక్ ఉంది. దీంతో హైదరాబాద్ మీద షోయబ్‌కు ఎంత ప్రేమో అంటూ.. సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.