చెపాక్ లో గ్రాండ్ విక్టరీ గంభీర్ రియాక్షన్ ఇదే
బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ను భారత్ ఘనవిజయంతో ఆరంభించింది. చెపాక్ లో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బంగ్లాను చిత్తు చేసింది. ఈ విజయంతో కోచ్ గా టెస్టుల్లోనూ శుభారంభం చేసిన గౌతమ్ గంభీర్ మ్యాచ్ ముగిసిన తర్వాత తన ఇన్ స్టా గ్రామ్ లో ఆరే పదాలతో పోస్ట్ పెట్టాడు.

బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ను భారత్ ఘనవిజయంతో ఆరంభించింది. చెపాక్ లో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బంగ్లాను చిత్తు చేసింది. ఈ విజయంతో కోచ్ గా టెస్టుల్లోనూ శుభారంభం చేసిన గౌతమ్ గంభీర్ మ్యాచ్ ముగిసిన తర్వాత తన ఇన్ స్టా గ్రామ్ లో ఆరే పదాలతో పోస్ట్ పెట్టాడు. A fantastic start! Well done boys అంటూ రాసుకొచ్చాడు. పాక్ పై బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ గెలవడంతో భారత్ పై ఎలా ఆడుతుందో అన్న అంచనాలు పెరిగాయి. అయితే గంభీర్, రోహిత్ పక్కా ప్లాన్ తో రెడ్ సాయిల్ పిచ్ రెడీ చూసి బంగ్లాదేశ్ కు చెక్ పెట్టారు. ఒకవిధంగా ఆసీస్ తో సిరీస్ కు ముందు పేస్ పిచ్ లపై ఆడాలన్న వ్యూహం కూడా ఉందని భావిస్తున్నారు.