రాజస్థాన్ తో తొలి మ్యాచ్ సన్ రైజర్స్ ఫుల్ షెడ్యూల్ ఇదే

ఐపీఎల్ లో చెన్నై,ముంబై, బెంగళూరు తర్వాత మంచి ఫాలోయింగ్ ఉన్న టీమ్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ కు పేరుంది. స్వదేశీ, విదేశీ స్టార్ ఆటగాళ్ళతో గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తూ క్రేజ్ పెంచుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 17, 2025 | 03:10 PMLast Updated on: Feb 17, 2025 | 3:10 PM

This Is Sunrisers Full Schedule For The First Match Against Rajasthan

ఐపీఎల్ లో చెన్నై,ముంబై, బెంగళూరు తర్వాత మంచి ఫాలోయింగ్ ఉన్న టీమ్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ కు పేరుంది. స్వదేశీ, విదేశీ స్టార్ ఆటగాళ్ళతో గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తూ క్రేజ్ పెంచుకుంది. 2024 సీజన్ లో అద్భుతంగా ఆడి ఫైనల్ కు చేరినా తృటిలో టైటిల్ చేజార్చుకుంది. ఈ సారి కప్పు కొట్టాలనే లక్ష్యంతో కొత్త సీజన్ కు సన్ రైజర్స్ రెడీ అవుతోంది. ఐపీఎల్ షెడ్యూల్ లో సన్ రైజర్స్ ఈ సారి సొంతగడ్డపై టైటిల్ వేటను మొదలుపెట్టనుంది. మొదటి మూడు మ్యాచ్ లలో రెండు హోంగ్రౌండ్ లోనే ఆడనుండగా.. మూడో మ్యాచ్ ను విశాఖలో ఆడుతుంది. మార్చి 23న రాజస్థాన్ రాయల్స్ తో ఆరెంజ్ ఆర్మీ తన తొలి మ్యాచ్ ఆడబోతోంది. రెండో మ్యాచ్ ఉప్పల్ స్టేడియం వేదికగా మార్చి 27న లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడుతుంది. మూడో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ హోం గ్రౌండ్ గా ఉన్న విశాఖలో ఆడుతుంది.

మార్చి 3న కోల్ కత్తా నైట్ రైడర్స్ తో తలపడిన తర్వాత మళ్ళీ సొంతగడ్డపై వరుసగా రెండు మ్యాచ్ లు ఆడుతుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా మార్చి 6న గుజరాత్ తోనూ, మార్చి 12న పంజాబ్ కింగ్స్ తోనూ తలపడనుంది. మార్చి 17న ముంబై ఇండియన్స్ తో వారి సొంతగడ్డపై తలపడనున్న సన్ రైజర్స్ తర్వాత హైదరాబాద్ వేదికగా మార్చి 23న ముంబైతోనే ఆడుతుంది. మార్చి 25న చెన్నై సూపర్ కింగ్స్ తోనూ, మే 2న గుజరాత్ టైటాన్స్ తోనూ, మే 5న ఢిల్లీ క్యాపిటల్స్ తోనూ, మే 10న కోల్ కత్తా నైట్ రైడర్స్ తోనూ తలపడుతుంది. తర్వాత మే 13న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడనున్న సన్ రైజర్స్ హైదరాబాద్ తన చివరి లీగ్ మ్యాచ్ లో మే 18న లక్నో సూపర్ జెయింట్స్ ను ఢీకొంటుంది.

మెగా వేలానికి ముందు సన్ రైజర్స్ రిటెన్షన్ ప్లేయర్స్ కోసం భారీగానే ఖర్చు చేసింది . కెప్టెన్, ఆస్ట్రేలియా ఆటగాడు పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ తో పాటు ఇద్దరు భారత స్టార్లు అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డిలను రిటైన్ చేసుకుంది. వికెట్ కీపర్ కామ్ బ్యాటర్ క్లాసెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తొలి ఆప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీసుకొని అతనికి 23 కోట్లు ఇచ్చింది. కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 18 కోట్లు, అభిషేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 14 కోట్లు, హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 14 కోట్లు యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నితీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రూ. 6 కోట్లతో తమతో పాటు కొనసాగించింది. మెగావేలంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించి పలువురి స్టార్ ప్లేయర్స్ ను దక్కించుకుంది. ప్యాట్ కమిన్స్‌కు తోడుగా టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ‌ని రూ. 10 కోట్లకు కొనుగోలు చేసిన కావ్య పాప.. పేస్ ఆల్‌రౌండర్ హర్షల్ పటేల్‌ను 8 కోట్లకు దక్కించుకుంది. వెటరన్ స్పిన్నర్లు రాహుల్ చాహర్, ఆడమ్ జంపాలను కొనుగోలు చేసింది. నెంబర్ 3 స్లాట్‌ కోసం ఇండియన్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను 11.25 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. అనామక బ్యాటర్లు అభినవ్ మనోహర్‌తో పాటు అథర్వ టైడ్‌లను తీసుకుంది. తమ హోమ్ గ్రౌండ్ అయిన ఉప్పల్ మైదానానికి తగ్గట్లుగానే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లను ఎంపిక చేసింది.