రెండో స్థానంలో టీమిండియా సెమీస్ చేరాలంటే ఈక్వేషన్ ఇదే

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ బోణీ కొట్టింది. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను ఓడించింది. మహ్మద్ షమీ సూపర్ స్పెల్, శుభమన్ గిల్ శతకంతో టోర్నీని ఘనంగా ఆరంభించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 22, 2025 | 05:45 PMLast Updated on: Feb 22, 2025 | 5:45 PM

This Is The Equation For Team India To Reach The Semis In Second Place

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ బోణీ కొట్టింది. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను ఓడించింది. మహ్మద్ షమీ సూపర్ స్పెల్, శుభమన్ గిల్ శతకంతో టోర్నీని ఘనంగా ఆరంభించింది. అయితే ఈ మ్యాచ్ లో గెలిచినా గ్రూప్ పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానంలోనే ఉంది. పాకిస్తాన్ పై విజ‌యం సాధించిన న్యూజిలాండ్ ఖాతాలోనూ రెండు పాయింట్లే ఉన్న‌ప్ప‌టికి పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది. భార‌త నెట్ ర‌న్‌రేటు కంటే కివీస్ నెట్ ర‌న్‌రేటు మెరుగ్గా ఉండ‌డ‌మే దీనికి కార‌ణం. పాక్ పై గెలిచిన న్యూజిలాండ్ ప్లస్ 1.20 నెట్ రన్ రేటుతో ఉంటే… భారత్ 0.48 రన్ రేట్ మాత్రమే సాధించింది. ఈ కారణంగానే రెండోస్థానంలో నిలిచింది. ఇక బంగ్లాదేశ్ మూడో స్థానంలో, పాకిస్థాన్ నాలుగో స్థానంలో ఉన్నాయి.

గ్రూపు-ఏలో టాప్‌-2లో నిలిచిన జ‌ట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. భార‌త జ‌ట్టు మ‌రో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా…. ఆదివారం పాకిస్తాన్‌తోనూ, మార్చి 2న న్యూజిలాండ్‌తో త‌ల‌ప‌డనుంది. ఆదివారం పాక్‌పై విజ‌యం సాధిస్తే భార‌త్ సెమీస్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంటుంది. అప్పుడు భార‌త్ ఖాతాలో 4 పాయింట్లు చేరుతాయి. అదే స‌మ‌యంలో పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్ర‌మిస్తుంది. ఒక‌వేళ పాక్ చేతిలో భార‌త్ ఓడిపోతే మాత్రం అప్పుడు న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమ్ఇండియా త‌ప్ప‌క గెల‌వాల్సి ఉంటుంది. అప్పుడు నెట్‌ర‌న్‌రేట్ కీల‌కం కావొచ్చు. మిగిలిన రెండు మ్యాచ్ లలోనూ గెలిస్తే గ్రూపులో టాప్ ప్లేస్ ను సొంతం చేసుకుంటుంది.

ఇక బంగ్లాదేశ్ విష‌యాని వ‌స్తే.. పాక్‌తో పోలిస్తే బంగ్లా నెట్‌ర‌న్‌రేట్ కాస్త బెట‌ర్‌ గా ఉంది. బంగ్లాదేశ్ తన తర్వాతి మ్యాచ్ లలో న్యూజిలాండ్, పాకిస్తాన్‌ల‌తో ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే సెమీస్‌కు చేరుకునే ఛాన్స్ ఉంది. అది అంత ఈజీ కాకపోవచ్చు. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి మాత్రం డూ ఆర్ డైలా మారింది. భార‌త్, బంగ్లాదేశ్ పై త‌ప్ప‌క గెలిస్తేనే సెమీస్ అవ‌కాశాలు ఉంటాయి. అది కూడా ఇత‌ర జ‌ట్ల స‌మీక‌ర‌ణాల‌పై ఆధార‌ప‌డాల్సి ఉంటుంది. ముందు పాకిస్థాన్ భారత జట్టును ఓడించాలి. అదే సమయంలో బంగ్లాదేశ్ జిలాండ్ ను ఓడించాల్సి ఉంటుంది. పాకిస్థాన్ జట్టు టీమిండియా చేతిలో ఓడిపోతే ఇంటిదారి పట్టాల్సిందే. గ్రూప్ ఏ నుంచి ప్రస్తుతానికి భారత్, కివీస్ సెమీస్ రేసులో ముందున్నాయి. ఇదిలా ఉంటే మొత్తం 8 జ‌ట్లు ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీలో బ‌రిలో ఉన్నాయి.