Rohit Sharma : ఇదే లాస్ట్ సీజన్… వైరల్ గా రోహిత్ శర్మ వీడియో
టీమిండియా (Team India) కెప్టెన్ రోహిత్ శర్మ (Captain Rohit Sharma) ముంబై ఇండియన్స్ (Mumbai Indians) యాజమాన్యం వ్యవహారశైలి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నాడా..వచ్చే ఏడాది అతడు జట్టును వీడనున్నాడా...ప్రస్తుతం ఈ ప్రశ్నలకు దాదాపు క్లారిటీ వచ్చేసినట్టే కనిపిస్తోంది.

rohit sharma
టీమిండియా (Team India) కెప్టెన్ రోహిత్ శర్మ (Captain Rohit Sharma) ముంబై ఇండియన్స్ (Mumbai Indians) యాజమాన్యం వ్యవహారశైలి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నాడా..వచ్చే ఏడాది అతడు జట్టును వీడనున్నాడా…ప్రస్తుతం ఈ ప్రశ్నలకు దాదాపు క్లారిటీ వచ్చేసినట్టే కనిపిస్తోంది.
రోహిత్ శర్మ- కోల్‌కతా నైట్ రైడర్స్ (Rohit Sharma- Kolkata Knight Riders) అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ మధ్య జరిగిన మాటలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇందులో రోహిత్ మాట్లాడుతూ ఒక దాని తర్వాత మరొకటి మారిపోతూ ఉన్నాయి. వాళ్లే ఇందుకు కారణం. ఏదేమైనా గానీ.. అది నా ఇల్లు బ్రదర్.. నేను నిర్మించిన గుడి అది. ఇదే నాకు లాస్ట్ అంటూ వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. దీనిని బట్టి రోహిత్ ముంబై ఫ్రాంఛైజీకి గుడ్‌బై చెప్పడం ఖాయమని అనిపిస్తోంది.
ఐపీఎల్ 17వ సీజన్ కంటే ముందే కెప్టెన్‌గా రోహిత్ శర్మపై వేటు వేసిన ముంబై ఫ్రాంఛైజీ.. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాకు (Hardik Pandya) పగ్గాలు అప్పగించింది. అయితే, అతడి సారథ్యంలో పేలవ ప్రదర్శనతో చతికిల పడిన ముంబై ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతిని మూటగట్టుకుంది. రోహిత్, హార్దిక్‌లకు మద్దతుగా జట్టు రెండు వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలోనే ఈ వైఫల్యాలు ఎదురయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పాండ్యా వ్యవహార శైలి పట్ల గుర్రుగా ఉన్న రోహిత్ వచ్చే ఏడాది ముంబై జట్టును వీడనున్నాడనే వార్తలు రాగా ఇప్పుడు తాజా వీడియోతో అది నిజమే అనిపిస్తోంది. కాగా ఈ వీడియోను పోస్ట్ చేసిన కోల్ కత్తా మళ్లీ కాసేపటికే డిలీట్ చేసింది.