ODI World Cup : వన్డే ప్రపంచకప్‌లో భారత్ రికార్డ్.. 10 లక్షల టికెట్లు తెగాయి..
భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ (ODI World Cup) .. పలు రికార్డులకు వేదికగా మారుతోంది. ఇప్పటికే టీవీ, హాట్ స్టార్ వీక్షణల్లో పలు రికార్డులు సృష్టించిన ఈ మహా టోర్నీ.. ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించింది.
భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ (ODI World Cup) .. పలు రికార్డులకు వేదికగా మారుతోంది. ఇప్పటికే టీవీ, హాట్ స్టార్ వీక్షణల్లో పలు రికార్డులు సృష్టించిన ఈ మహా టోర్నీ.. ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించింది. ఇప్పటివరకూ జరిగిన ఏ దేశంలో జరిగిన ప్రపంచకప్ టోర్నీకి దక్కని రికార్డు భారత్ వేదికగా జరిగిన ఎడిషన్ దక్కించుకుంది. ఈసారి వన్డే ప్రపంచకప్‌లో స్టేడియానికి వచ్చి మ్యాచ్ చూసిన వీక్షకుల సంఖ్య 10 లక్షలు దాటింది.
IPL : తేరుకున్న ఫ్రాంచైజీలు.. డిసెంబర్ 15-19 మధ్య దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2024 మినీ వేలం.
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ICC ఈవెంట్ చరిత్రలో ఇలా 10 లక్షల మంది కంటే ఎక్కువ అభిమానులు స్టేడియానికి తరలివచ్చి మ్యాచ్‌ను చూడడం ఇదే తొలిసారి. అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికా-అఫ్గానిస్థాన్ మ్యాచ్‌తో స్టేడియానికి వచ్చి మ్యాచ్ చూసే వారి సంఖ్య పది లక్షలు దాటింది. పది లక్షల మందికి పైగా అభిమానులు స్టేడియానికి వచ్చి మ్యాచ్‌లను చూడడం వన్డే ఫార్మాట్‌కు ఆదరణ తగ్గలేదని నిరూపిస్తోందని, ప్రపంచ కప్ విలువ ఏంటో తెలియజేస్తోందని ఐసీసీ ఈవెంట్స్ అధిపతి క్రిస్ టెట్లీ చెప్పాడు. ప్రపంచకప్‌ను టీవీల్లో వీక్షించే వారి సంఖ్య గత ప్రపంచకప్‌తో పోలిస్తే 43 శాతం వృద్ధి చెందిందని జై షా ట్వీట్ చేశాడు. టీవీ వీక్షకుల సంఖ్య భారీగా పెరిగిందని వెల్లడించారు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లను టీవీలో 36.42 కోట్ల మంది వీక్షించారని వివరించాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇదో కొత్త రికార్డు అని జైషా ట్వీట్‌లో పేర్కొన్నాడు.