శతక్కొట్టిన తిలక్ వర్మ క్లాస్ బ్యాటింగ్ తో అదుర్స్
క్రికెట్ లో పరిస్థితులకు తగ్గట్టు ఆడితేనే ఫ్యూచర్ ఉంటుంది... ఫార్మాట్ కు తగ్గ స్టైల్ లోనే బ్యాటింగ్ చేయాలి...
క్రికెట్ లో పరిస్థితులకు తగ్గట్టు ఆడితేనే ఫ్యూచర్ ఉంటుంది… ఫార్మాట్ కు తగ్గ స్టైల్ లోనే బ్యాటింగ్ చేయాలి… టెస్టుల్లో టీ ట్వంటీ తరహా బ్యాటింగ్ చేస్తే అప్పటికప్పుడు మార్కులు పడినా రెడ్ బాల్ క్రికెట్ కు అది సూట్ కాదు. సుధీర్ఘ ఫార్మాట్ లో పెద్ద ఇన్నింగ్స్ ఆడాలంటే ఎంతో ఓపిక ఉండాలి. హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ ఇలాంటి తరహా ఇన్నింగ్స్ ఆడుతూ అదరగొట్టాడు. దులీప్ ట్రోఫీలో సెంచరీతో మెరిసాడు. ఇండియా డితో జరుగుతున్న మ్యాచ్ లో క్లాస్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున ఎన్నో మెరుపు ఇన్నింగ్స్ లు ఆడిన తిలక్ వర్మ రెడ్ బాల్ క్రికెట్ లోనూ తాను ఆడగలనని నిరూపించుకున్నాడు. తన సహజశైలి బ్యాటింగ్ ను పక్కన పెట్టి టెస్ట్ ఫార్మాట్ కు తగ్గట్టు ఆడాడు.
184 బంతుల్లో 9 ఫోర్లతో 104 పరుగులు చేశాడు. స్ట్రైక్ రొటేషన్ మీదే ఫోకస్ పెట్టి అడ్డగోలు షాట్లకు వెళ్లకుండా సంయమనం పాటించాడు. చెత్త బంతులను మాత్రమే బౌండరీలు కొట్టి కీలక సమయాల్లో సాలిడ్ డిఫెన్స్‌తో ప్రత్యర్థి బౌలర్లను విసిగించాడు.
ఇటీవల కాలంలో తిలక్ అంతగా రాణించడం లేదు. గాయం వల్ల కూడా అతడు ఎంతో ఇబ్బంది పడ్డాడు. టీమిండియాలో వస్తూ పోతూ ఉన్న తిలక్.. నిలకడగా రాణిస్తేనే తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలుగుతాడు. ఇటీవలే గాయం నుంచి కోలుకున్న ఈ హైదరాబాదీ క్రికెటర్ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ చూడడంతో ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు.