Tilak Varma: నెట్స్‌లో తెలుగోడి భారీ సిక్సర్లు.. ప్రత్యర్ధి బౌలర్లకు ఇక చుక్కలే
నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా భారీ సిక్స్‌లు ప్రాక్టీస్ చేశాడు. బ్యాటింగ్ కోచ్ కీరన్ పోలార్డ్ పర్యవేక్షణలో బ్యాటింగ్ సాధన చేసిన తిలక్ వర్మ.. భారీ సిక్స్‌లు బాదాడు. తిలక్ వర్మ భారీ సిక్స్‌లకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

Tilak Varma: ఐపీఎల్ 2024 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ సిద్దమవుతున్నాడు. వాంఖడే మైదానం వేదికగా జరుగుతున్న ముంబై ఇండియన్స్ ప్రీ సీజన్ ప్రాక్టీస్ క్యాంప్‌లో తిలక్ వర్మ ముమ్మరంగా సాధన చేస్తున్నాడు. నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా భారీ సిక్స్‌లు ప్రాక్టీస్ చేశాడు. బ్యాటింగ్ కోచ్ కీరన్ పోలార్డ్ పర్యవేక్షణలో బ్యాటింగ్ సాధన చేసిన తిలక్ వర్మ.. భారీ సిక్స్‌లు బాదాడు.
Sarfaraz Khan: ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇవ్వనున్న సర్ఫరాజ్.. చిచ్చర పిడుగుపై కన్నేసిన ఫ్రాంచైజీలు
తిలక్ వర్మ భారీ సిక్స్‌లకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ వీడియోలో తిలక్ వర్మ రివర్స్ స్వీప్, స్వీప్ షాట్లతో పాటు నటరాజ్ షాట్స్‌తో భారీ సిక్స్‌లు బాదాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. తిలక్ వర్మ మరోసారి తన సత్తా ఏంటో చూపిస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసిన తిలక్ వర్మ.. ఇప్పటి వరకు 25 మ్యాచ్‌లు ఆడి 144.53 స్ట్రైక్‌రేట్ 740 పరుగులు చేసాడు.
ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ అసాధారణ ప్రదర్శనతో భారత జట్టులో చోటు దక్కించుకున్న అతను.. టీ20, వన్డే క్రికెట్‌లో అరంగేట్రం కూడా చేశాడు.
Tilak’s bat striking the 𝐩𝐞𝐫𝐟𝐞𝐜𝐭 chord in the nets 🎶🤌#OneFamily #MumbaiIndians #NetSetGo @TilakV9 pic.twitter.com/jcsT3NfYBX
— Mumbai Indians (@mipaltan) March 18, 2024