Tilak Varma: అప్పుడు సిరాజ్ విషయంలో తప్పు.. ఇప్పుడు తిలక్ విషయంలో కూడా..
మెగా టోర్నీ ఆరంభానికి ముందు గాయం కారణంగా జస్‌ప్రీత్ బుమ్రా టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకున్నాడు. అయితే అనుభవానికి పెద్ద పీఠ వేసిన బీసీసీఐ సెలెక్టర్లు షమీని తీసుకుని, ఫామ్‌లో ఉన్న సిరాజ్‌ను స్టాండ్ బై ప్లేయర్‌గా టి20 ప్రపంచకప్‌కు ఎంపిక చేసింది.
Tilak Varma: సరిగ్గా ఏడాది క్రితం ఇదే సమయంలో టీమిండియా టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా ఉంది. అయితే టోర్నీ ఆరంభానికి ముందు భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మెగా టోర్నీ ఆరంభానికి ముందు గాయం కారణంగా జస్‌ప్రీత్ బుమ్రా టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకున్నాడు. అయితే అనుభవానికి పెద్ద పీఠ వేసిన బీసీసీఐ సెలెక్టర్లు షమీని తీసుకుని, ఫామ్‌లో ఉన్న సిరాజ్‌ను స్టాండ్ బై ప్లేయర్‌గా టి20 ప్రపంచకప్‌కు ఎంపిక చేసింది.
అది ఎంత పెద్ద తప్పో తెలిసేందుకు టీమిండియాకు ఎంతో సమయం పట్టలేదు. ఇక ప్రస్తుతం వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా రెడీ అవుతుంది. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయంతో ఉండగా.. పరుగుల వరద పారిస్తున్న తిలక్ వర్మను టీమిండియాకు ఎంపిక చేయాలని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అనుభవాన్ని పక్కన పెట్టి వెంటనే అతడికి ఆసియాకప్, వన్డే ప్రపంచకప్‌లలో చోటు కల్పించాలని బీసీసీఐకి సూచిస్తున్నారు.