ఓపెనర్లే హీరోలు తలరాత మార్చే బౌలర్లు?
ఆర్ సి బి జట్టు ఫాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్సీలో, మరియు సంజయ్ బంగర్ పర్యవేక్షణలో కోచ్‌గా ఉంది. ఆట యొక్క క్రమాన్ని నిర్ణయించే విషయానికి వస్తే ఇద్దరికీ మంచి కెమిస్ట్రీ ఉంది. జట్టులో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఫాఫ్, కోహ్లీ ఉంటారని అంచనా. ఆర్ సి బి నేటి మ్యాచులో గెలిస్తే ఐదవ స్థానం నుండి 3 వ స్థానంలోకి వస్తుంది.

Bowlers and Batsmens in IPL 2023
కె కె ఆర్ జట్టు ఇతర జట్ల చేతిలో నిలకడగా ఓడిపోయింది. నితీష్ కెప్టెన్‌గా ఉండి, జట్టును బాగా స్కోర్ చేసి, మార్గనిర్దేశం చేస్తున్నాడు, అయితే గత మ్యాచ్‌లలో అదృష్టం కలిసి రాలేదు. కానీ, కలకత్తా జట్టు పెర్ఫామ్ చేస్తున్న విధానం చూస్తుంటే, ఈ మ్యాచులో వారు గెలిచినా కూడా ఆశ్చర్యం లేదు. ఈ సీజన్లో ఇరు జట్లు తలపడడం ఇది రెండోసారి. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై కలకత్తా 81 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
రెండు జట్లూ సమాన స్థాయిలో రాణించగల ఆటగాళ్లను, కెప్టెన్లను కలిగి ఉంది. కలకత్తా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంటే, ఆర్సీబీ మ్యాచ్ గెలవవచ్చని ప్రెడిక్షన్స్ చెప్తున్నాయి. మొదటగా బ్యాటింగ్ చేసిన జట్ల నుంచి ఊహించదగిన స్కోరు 150 నుంచి 180 . స్పిన్నర్లకు స్వర్గధామంలా ఉండే బెంగళూరు వాతావరణం, కీలక సమయాల్లో మ్యాచును మలుపుతిప్పబోతుంది. ఇరు జట్లలో ఉద్దండులైన స్పిన్నర్లు ఉండడం, మ్యాచ్ పై అభిమానుల్లో మరింత ఆసక్త్తిని పెంచుతోంది.