పాపం మీకేంట్రా ఈ శాపం సఫారీలపై జాలి పడుతున్న ఫాన్స్
ఆ జట్టులో టాలెంట్ కు కొదవ లేదు...మ్యాచ్ విన్నర్లుకు కొదవ లేదు...టాప్ బౌలర్లు ఉన్నారు...మ్యాచ్ ను ఒంటిచేత్తో మలుపు తిప్పే బ్యాటర్లు కూడా ఉన్నారు...కానీ ఏం లాభం ఐసీసీ టోర్నమెంట్ గెలవాలన్న కల మాత్రం నెరవేరడం లేదు.

ఆ జట్టులో టాలెంట్ కు కొదవ లేదు…మ్యాచ్ విన్నర్లుకు కొదవ లేదు…టాప్ బౌలర్లు ఉన్నారు…మ్యాచ్ ను ఒంటిచేత్తో మలుపు తిప్పే బ్యాటర్లు కూడా ఉన్నారు…కానీ ఏం లాభం ఐసీసీ టోర్నమెంట్ గెలవాలన్న కల మాత్రం నెరవేరడం లేదు. ఆ జట్టుకు చోకర్స్ అనే ముద్రను పోగొట్టుకోవడానికి ఇంకెంతకాలం పడుతుందో, ఇంకెన్ని ఐసీసీ టోర్నమెంట్ లు అవసరమో తెలియట్లేదు..కీలక మ్యాచుల్లో ఒత్తిడికి గురవ్వడం, ఓటమి పాలవ్వడం ఆ జట్టుకు శాపంగా మారిపోయింది. తాజాగా సౌతాఫ్రికా సెమీఫైనల్ లో న్యూజిలాండ్ పై ఓడిపోయింది. దీంతో మరో చెత్త రికార్డును మూటగట్టుకుంది.
ఐసీసీ వన్డే టోర్నమెంట్ సెమీఫైనల్స్ లో 11 సార్లు అడుగుపెట్టిన సౌతాఫ్రికా జట్టు ఏకంగా తొమ్మిది సార్లు ఓటమిని అందుకుంది. కేవలం ఒక్క విజయాన్ని మాత్రమే ఖాతాలో వేసుకుంది. అది కూడా 1998 ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంకపై గెలిచింది. 1999 CWC ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ టైగా నిలిచింది. గత పదేళ్ల కాలంలో చూస్తే సౌతాఫ్రికా 2014 టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్, 2015 ప్రపంచ కప్ సెమీ ఫైనల్, 2023 ప్రపంచ కప్ సెమీఫైనల్, 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ లో ఓడింది
ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో తొలి ఎడిషన్ 1998లో విజేతగా నిలిచిన సఫారీలు.. ఆ తర్వాత నుంచి విఫలమవుతూనే ఉన్నారు. 2000, 2002 ఛాంపియన్స్ ట్రోఫీ సీజన్లలో వరుసగా సెమీ ఫైనల్స్‌కు చేరుకున్న సౌతాఫ్రికా జట్టు రెండు సార్లు ఓటమిని అందుకుంది. 2006, 2013తో పాటు ఇప్పుడు 2025 సెమీఫైనల్ లోనూ ఓడిపోయింది. మొత్తంగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆరుసార్లు సెమీఫైనల్ కు అర్హత సాధించిన సౌతాఫ్రికా ఐదు సార్లు ఓడిపోయింది.
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లలోనూ దక్షిణాఫ్రికా ఇదే చెత్త ప్రదర్శన చేసింది . 1992లో సెమీఫైనల్స్‌లో ఇంగ్లాండ్ పై, 1999లో ఆస్ట్రేలియాపై, 2007లోనూ ఆస్ట్రేలియాపై, 2015లో న్యూజిలాండ్‌పై ఓటమిని అందుకుంది. 2023లో మరోసారి ఆస్ట్రేలియాపై పరాజయాన్ని అందుకుంది. ఐసీసీ ఈవెంట్లలో దక్షిణాఫ్రికా రెండు సార్లు మాత్రమే ఫైనల్స్‌కు అర్హత సాధించింది. 1998 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్స్‌కు చేరి విజయం సాధించిన సఫారీలు.. 2024 టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టుపై ఓడారు. అందుకే సౌతాఫ్రికాను చోకర్స్ అని ట్రోల్ చేస్తుంటారు.