CSK vs SRH : సిక్సర్లలో తోపు టీమ్ ఆ జట్టే…
ఐపీఎల్ 17వ సీజన్ లో చాలా వరకూ బ్యాటర్ల ఆధిపత్యమే కనిపిస్తోంది. అసలు ఈ పరిస్థితికి కారణం సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ అనడంలో ఏ మాత్రం డౌట్ లేదు.

Topu team among the sixers is that team...
ఐపీఎల్ 17వ సీజన్ లో చాలా వరకూ బ్యాటర్ల ఆధిపత్యమే కనిపిస్తోంది. అసలు ఈ పరిస్థితికి కారణం సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ అనడంలో ఏ మాత్రం డౌట్ లేదు. తమ పవర్ హిట్టింగ్‌తో ఈ సీజన్ కు ఒక్కసారిగా ఊపుతీసుకొచ్చింది. కాగా ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉన్న భారీ రికార్డును బద్దలుకొట్టి.. సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐపీఎల్‌లో ఒక సీజన్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన టీమ్‌గా సన్‌రైజర్స్ సరికొత్త రికార్డును సృష్టించింది.
2018 ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 145 సిక్సులు కొట్టి ఈ జాబితాలో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఈ సీజన్‌లో కేవలం 12 మ్యాచ్‌ల్లోనే 146 సిక్సులతో సీఎస్‌కే రికార్డును బ్రేక చేస్తూ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ నంబర్ వన్ టీమ్‌గా అవతరించింది. పైగా సన్‌రైజర్స్ ఇంకా లీగ్ దశలోనే రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. దీంతో ఈ సీజన్ లో సిక్సర్ల వరకూ సరికొత్త రికార్డులు నమోదవడం ఖాయంగా కనిపిస్తోంది.