వుమెన్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్, జట్టులో స్మృతి , దీప్తి శర్మ
ఐసీసీ మహిళల వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ జట్టులో భారత్ నుంచి ఇద్దరు ప్లేయర్స్్ కు చోటు దక్కింది. గత ఏడాది వైట్ బాల్ ఫార్మాట్ లో అద్భుతంగా రాణించిన ఓపెనర్ స్మృతి మంధాన,
ఐసీసీ మహిళల వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ జట్టులో భారత్ నుంచి ఇద్దరు ప్లేయర్స్్ కు చోటు దక్కింది. గత ఏడాది వైట్ బాల్ ఫార్మాట్ లో అద్భుతంగా రాణించిన ఓపెనర్ స్మృతి మంధాన, స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మలు వన్డే టీమ్ లోకి ఎంపికయ్యారు. స్మృతి మంధాన 2024లో 13 వన్డేలు ఆడి 747 పరుగులు చేసింది. తద్వారా అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచింది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో వరుసగా రెండు శతకాలు బాదిన ఆమె న్యూజిలాండ్‌పై కూడా ఒక సెంచరీ చేసింది. అలాగే గత ఏడాది 13 వన్డేలాడిన దీప్తి శర్మ 186 పరుగులు చేయడంతో పాటు… 24 వికెట్లు పడగొట్టి ఈ జట్టులో చోటు దక్కించుకుంది. ఈ జట్టుకు దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ లౌరా వాల్వర్ట్ కెప్టెన్ గా ఎంపికైంది.