KL Rahul: కె.ఎల్.రాహుల్‌ని పీకేయండిరా బాబూ..!
టీమిండియా ఓపెనర్ కె.ఎల్.రాహుల్ ఇటీవలికాలంలో ఏమాత్రం సరిగా ఆడట్లేదు. అతని పర్ఫార్మెన్స్ పై అనేక విమర్శలు వస్తున్నాయి. అయినా అతణ్ణి ఎందుకు జట్టులో కొనసాగిస్తున్నారో అస్సలు అర్థం కావట్లేదు.
ఓపెనింగ్ కి వస్తాడు. పట్టుమని 10 బంతులు కూడా ఆడడు.. 4 రన్స్ కొట్టడు.. ఐనా జట్టు లోనే ఉంటాడు.. ఒక పక్క యంగ్ తరంగ్ లు దూసుకొస్తున్నారు. గిల్ లాంటివాళ్ళు టన్నుల టన్నులు రన్స్ కొడుతున్నారు. ఐనా కొత్తవాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు. KL రాహుల్ ని ఇంకా టీమ్ ఇండియాలో ఎందుకు కొనసాగిస్తున్నారో దేశంలో ఎవ్వరికి అర్థం కాదు.
నాగపూర్ టెస్ట్ లో భారత్ 132 పరుగులు… ఇన్నింగ్స్ తేడాతో ఆస్ట్రేలియాని చిత్తుగా ఓడించింది. కానీ ఈ మాచ్ మొదటి ఇన్నింగ్స్ లో రాహుల్ 71 బాల్స్ ఆడి కేవలం 20 రన్స్ మాత్రమే చేసి ఔటయ్యాడు. ఐనా రాహుల్ ని జట్టు నుంచి తీసేయ్యరు. అదే మరో జూనియర్ ఆటగాడైతే పరిస్థితి మరో రకంగా ఉండేది. గడచిన 10 ఇన్నింగ్స్ లో రాహుల్ కేవలం ఒక్క హాఫ్ సెంచురి మాత్రమే కొట్టాడు. చివరి ఐదు ఇన్నింగ్స్ లో రాహుల్ స్క్రోర్స్ ఇవి. 22, 23, 10, 02, 20.. ఇలా వరసగా 5 సార్లు తక్కువ స్క్రోర్స్ కి ఇంటి దారి పట్టాడు. మొత్తం ఇప్పటివరకి 46 టెస్టుల్లో 34 యావరేజ్ తో 2624 రన్స్ మాత్రమే చేసాడు. ఐనా కూడా నాగపూర్ టెస్ట్ కి రాహుల్ ని ఎంపిక చేశారు. అంతకు ముందే వన్డే లో డబుల్ సెంచరీ చేసిన గిల్ ని కూడా కాదని రాహుల్ కి మళ్ళీ అవకాశం ఇచ్చారు.
రాహుల్ ఎంపిక లో కచ్చితంగా భారీ లాబీయింగ్ ఉందని, పక్షపాతం చూపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒకప్పటి అల్లరౌండర్ వేంకటేష్ ప్రసాద్ లాంటివాళ్ళు కూడా రాహుల్ ని ఎలా సెలెక్ట్ చేస్తున్నారంటూ రుసరుసలాడుతున్నారు. 8 ఏళ్లలో 46 టెస్టుల్లో రాహుల్ యావరేజ్ కేవలం 36. ఇదేం గొప్ప యావరేజ్ కాదు. ఐనా సెలక్షన్ కమిటీ కె.ఎల్. రాహుల్ ని ఎంపిక చేయడం పైనే విమర్శలు వస్తున్నాయి. ఒకపక్క గిల్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఇరగదీస్తున్నాడు. మరో పక్క సర్ఫరాజ్ లాంటివాళ్ళు దేశవాళీ క్రికెట్ లో సెంచరీలు బాదుతున్నారు. వీళ్ళని వదిలేసి రాహుల్ పై ఎందుకు అంత ప్రేమ? KL రాహుల్ ఫార్మ్ లో లేడు. ఐనా సెలెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికైనా సెలెక్షన్ కమిటీ కళ్ళుతెరిచి రాహుల్ బదులు ప్రతిభ గలిగిన యూత్ ప్లేయర్స్ కి అవకాశం ఇస్తే మంచిది.