Urvashi Rautela: నా హైట్ కూడా లేరు.. పంత్‌ను మళ్లీ టార్గెట్ చేసిన ఊర్వశి
రెండేళ్ల కిందట తొలిసారి వీళ్ల మధ్య సోషల్ మీడియా వార్ జరగగా.. మళ్లీ ఇన్నాళ్లకు ఊర్వశి ఇలాంటి కామెంట్స్ చేయడం అభిమానుల ఆగ్రహానికి గురి చేస్తోంది. ఆమెతో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు ఏదో నడుస్తోందన్న పుకార్లు చాలా రోజులుగా వస్తూనే ఉన్నాయి.

Urvashi Rautela: రిషబ్ పంత్‌పై బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా మరోసారి నోరు పారేసుకుంది. ఈసారి అతని హైట్ గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ ట్రోల్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండేళ్ల కిందట తొలిసారి వీళ్ల మధ్య సోషల్ మీడియా వార్ జరగగా.. మళ్లీ ఇన్నాళ్లకు ఊర్వశి ఇలాంటి కామెంట్స్ చేయడం అభిమానుల ఆగ్రహానికి గురి చేస్తోంది. ఆమెతో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు ఏదో నడుస్తోందన్న పుకార్లు చాలా రోజులుగా వస్తూనే ఉన్నాయి.
Nabha Natesh: ఇస్మార్ట్ పోరి.. నభా నటేష్.. లేటెస్ట్ ఫొటోస్..
ముంబైలో ఒకసారి ఈ ఇద్దరూ కలిసి కనిపించారు. అయితే తర్వాత ఏమైందోగానీ ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు తిట్టిపోసుకున్నారు. అప్పటి నుంచీ పంత్‌ను లక్ష్యంగా చేసుకొని ఊర్వశి ఏదో ఒకరకంగా ట్రోల్ చేస్తూనే ఉంది. ఇక ఇప్పుడు ఆమె తన లవ్, డేటింగ్ జీవితంపై స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇందులోనూ పరోక్షంగా ఆమె పంత్‌ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించింది.
తాను యాక్టర్స్‌తోపాటు వ్యాపారవేత్తలు, సింగర్లు, బ్యాట్స్‌మెన్‌తోనూ డేటింగ్ చేసినట్లు చెప్పుకొచ్చింది. బ్యాట్స్‌మెన్ అని అన్న తర్వాత అందులో కొందరు నా హైట్ కూడా లేరు అని ఊర్వశి అనడం చర్చకు దారితీసింది. అది కచ్చితంగా రిషబ్ పంత్‌ను ఉద్దేశించే చేసిన కామెంట్స్ అని నెటిజన్లు ఫిక్సయిపోయారు.